సినిమా వాళ్లతో డేటింగ్ చేయనన్న శోభిత.. చివరకు నాగచైతన్యనే పెళ్లాడిందేంటి? అసలు మ్యాటర్ ఇదే!

సినిమా వాళ్లతో డేటింగ్ చేయనన్న శోభిత.. చివరకు నాగచైతన్యనే పెళ్లాడిందేంటి? అసలు మ్యాటర్ ఇదే!

ప్రేమ, పెళ్లి, బంధాల విషయంలో కాలంతో పాటు  మన ఆలోచనలు మారుతుంటాయి.  ఒకప్పుడు అసాధ్యం అనుకున్నదే.. జీవితంలో అందమైన అనుభవంగా మారొచ్చు. అలాగే గతంలో నటుడిని అసలకి పెళ్లాడను, డేటింగ్ కూడా చేయను చెప్పిన స్టైలిష్ బ్యూటీ శోభిత ధూళిపాళ్ల.. ఏకంగా టాలీవుడ్ హీరో నాగచైతన్యను వివాహం చేసుకుని వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టింది. దీనిపై లేటెస్ట్ గా ఓ ఇంటర్వ్యూలో తన గత కామెంట్స్ పై ఆసక్తకరమైన కామెంట్స్ చేసింది కింగ్ నాగార్జున పెద్ద కోడలు.

అప్పటి మాటలు.. ఇప్పటి ఆలోచనలు!

గతంలో  ఓ ఇంటర్వ్యూ వీడియోలో శోభిత.. తాను నటనా రంగానికి చెందిన వ్యక్తితో డేటింగ్‌ చేయనని చెప్పిన సంగతి తెలిసిందే. అయితే లేటెస్ట్ గా జరిగిన ఓఇంటర్య్వూ సంభాషణలో ఆమె తన పాత వ్యాఖ్యలపై స్పందించారు. అప్పట్లో తన చుట్టూ కనిపించిన పరిస్థితులు, అనుభవాల ఆధారంగానే అలా సాధారణీకరించి మాట్లాడి ఉండొచ్చని అంగీకరించారు. వయసు పెరిగేకొద్దీ, కొత్త అనుభవాలు ఎదురయ్యేకొద్దీ మనుషుల ఆలోచనా విధానం మారుతుందని శోభిత అభిప్రాయపడ్డారు.

ప్రేమంటే రొమాన్స్‌ మాత్రమే కాదు..

ఒకప్పుడు ఉన్న అభిప్రాయానికే కట్టుబడి ఉండాల్సిన అవసరం లేదని, పరిస్థితులను అర్థం చేసుకుంటూ మన ఆలోచనలను మార్చుకోవడంలో తప్పేమీ లేదని ఆమె స్పష్టం చేశారు. ఎప్పటికీ ఒకే అభిప్రాయంతో ఉండాలని ప్రయత్నించడం కంటే, మార్పును స్వీకరించడం ముఖ్యమని ఆమె వ్యాఖ్యానించారు. ప్రేమ గురించి కూడా శోభిత తనదైన అభిప్రాయాన్ని వెల్లడించారు. ఇద్దరి మధ్య ఏర్పడే బంధం కేవలం రొమాన్స్‌కే పరిమితం కాదని.. అది మనసుల కలయిక, అంతర్గతంగా కలిగే ఓ ప్రత్యేకమైన స్పందన అని వివరించారు.

వాస్తవాలను అర్థం చేసుకుంటూ..

నాగచైతన్యతో తన వ్యక్తిగత జీవితంపై వస్తున్న వార్తలు, ప్రజల్లో నెలకొనే ఆసక్తి గురించి మాట్లాడుతూ.. సమాజంలో అభిప్రాయాలు వాతావరణంలా మారుతుంటాయని శోభిత పేర్కొన్నారు. వాటినే పట్టుకుని ఉంటే మనశ్శాంతిని కోల్పోయే ప్రమాదం ఉందని అభిప్రాయపడ్డారు. ఇతరుల స్పందనల కంటే, వాస్తవాలను అర్థం చేసుకుంటూ మన వ్యక్తిత్వంపై స్పష్టతతో ఉండటమే ముఖ్యమని చెప్పారు. శోభిత ధూళిపాళ్ల, నాగచైతన్య 2024 డిసెంబర్‌ 4న హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్‌లో కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో సంప్రదాయబద్ధంగా వివాహం చేసుకున్నారు.