
హీరో మంచు విష్ణు డ్రీం ప్రాజెక్ట్ కన్నప్ప విడుదలై పాజిటివ్ టాక్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. శుక్రవారం ( జూన్ 27 ) వరల్డ్ వైడ్ గ్రాండ్ గా రిలీజైన పాన్ ఇండియా సినిమా ఫస్ట్ డే డీసెంట్ ఓపెనింగ్స్ సాధించింది. మొదటి రోజు ఇండియాలో రూ. 9.35 కోట్లు నెట్ వసూలు చేసి విష్ణు కెరీర్లోనే హయ్యెస్ట్ ఓపెనింగ్స్ సాధించిన సినిమాగా నిలిచింది కన్నప్ప. ఇదిలా ఉండగా కన్నప్ప ఇండస్ట్రీ హిట్ అంటూ మేకర్స్ రిలీజ్ చేసిన పోస్టర్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. సినిమా రిలీజైన రెండో రోజే ఇండస్ట్రీ హిట్ అంటూ పోస్టర్ రిలీజ్ చేయడంపై పెద్ద ఎత్తున ట్రోల్స్ చేస్తున్నారు నెటిజన్స్.
ఇటీవల కలెక్షన్స్ విషయంలో ఫేక్ పోస్టర్స్ రిలీజ్ చేస్తున్నారంటూ రచ్చ జరిగిన సంగతి తెలిసిందే. కలెక్షన్స్ విషయంలో హీరోల ఫ్యాన్స్ కి సోషల్ మీడియాలో పెద్ద వార్ జరగడం కూడా మాములే. కానీ.. ఇలా సినిమా రిలీజైన రెండో రోజే ఇండస్ట్రీ హిట్ అంటూ పోస్టర్ రిలీజ్ చేయడంతో అందరు షాక్ అయ్యారు. అసలే మంచు ఫ్యామిలీని ట్రోల్ చేయడం కోసం ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తుంటారు ఒక సెక్షన్ ఆఫ్ మేమర్స్. అలాంటిది ఇండస్ట్రీ హిట్ అంటూ పోస్టర్ వదిలి ట్రోలర్స్ కి మాంచి స్టఫ్ ఇచ్చారు మంచు విష్ణు.
కన్నప్ప ఇండస్ట్రీ హిట్ పోస్టర్ పై సోషల్ మీడియాలో పెద్దఎత్తున ట్రోల్స్ సర్కులేట్ అవుతున్నాయి. ఇది విష్ణు కెరీర్ కి ఇండస్ట్రీ హిట్ లాంటిదే అని కొంతమంది నెటిజన్స్ కామెంట్ చేస్తుంటే.. ఫేక్ కలెక్షన్స్ వేసుకోవడం కంటే ఇదే బెటర్ అంటూ కొంతమంది పాజిటివ్ గా రియాక్ట్ అవుతున్నారు. సినిమా పాజిటివ్ టాక్ వచ్చి ట్రోల్స్ పడట్లేదని ఫీల్ అయిన విష్ణు ఉద్దేశపూర్వకంగానే ఈ పోస్టర్ వదిలాడు అంటూ మరికొంతమంది నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు.