Sonakshi Sinha, Zaheer Iqbal Marriage:పెళ్లి చేసుకున్న బాలీవుడ్ బ్యూటీ సోనాక్షి సిన్హా.. ఫొటోస్ వైరల్

Sonakshi Sinha, Zaheer Iqbal Marriage:పెళ్లి చేసుకున్న బాలీవుడ్ బ్యూటీ సోనాక్షి సిన్హా.. ఫొటోస్ వైరల్

బాలీవుడ్ సీనియర్ నటుడు శత్రుఘ్న సిన్హా కూతురు, స్టార్ హీరోయిన్ సోనాక్షి సిన్హా పెళ్లి చేసుకున్నారు. ఏడేళ్లుగా సోనాక్షి సిన్హా నటుడు జహీర్ ఇక్బల్ తో ప్రేమలో ఉన్న విషయం తెలిసిందే. తాజాగా ఈ ఇద్దరు పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. అయితే.. పెళ్లి చాలా సింపుల్ గా రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్న ఈ జంట.. రిసెప్షన్ వేడుకలు మాత్రం చాలా గ్రాండ్ గా చేసుకున్నారు ఈ జంట.

ఈ వేడుకలకు బాలీవుడ్ ప్రముఖులు హాజరై కొత్త జంటకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రస్తుతం సోనాక్షి, జహీర్ పెళ్లికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దాంతో సెలెబ్రెటీలు, అభిమానులు, నెటిజన్లు కొత్త జంటకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.