నీకు దండం ఎట్టుకుంట పిల్ల.. విశ్వక్ సేన్ ఫంకీ మూవీ నుంచి సాంగ్ రిలీజ్

నీకు దండం ఎట్టుకుంట పిల్ల.. విశ్వక్ సేన్ ఫంకీ మూవీ నుంచి సాంగ్ రిలీజ్

విశ్వక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సేన్ హీరోగా ‘జాతిరత్నాలు’ ఫేమ్ కేవీ అనుదీప్ తెరకెక్కిస్తున్న చిత్రం ‘ఫంకీ’. సూర్యదేవర నాగ వంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్న ఈ చిత్రం ప్రేమికుల రోజు కానుకగా ఫిబ్రవరి 13న థియేటర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు వస్తోంది.  ఇప్పటికే టీజర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ఫస్ట్ సాంగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో  ఇంప్రెస్ చేసిన మేకర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌.. శనివారం (జనవరి 31)  ‘రట్టాటటావ్’ అనే పాటను విడుదల చేశారు. 

 భీమ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సిసిరోలియో కంపోజ్ చేసిన ఈ ఎనర్జిటిక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సాంగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ‘రట్టాటటావ్ పిల్ల రట్టాటటావ్.. నీకు దండం ఎట్టుకుంట పిల్ల రట్టాటటావ్’  అంటూ దేవ్ పవార్ రాసిన లిరిక్స్, రామ్ మిరియాల పాడిన తీరు సరదాగా సాగింది.  ఇందులో  విశ్వక్ సేన్, కయాదు లోహర్ ఆన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్క్రీన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కెమిస్ట్రీ ఆకట్టుకుంది.  ఈ సందర్భంగా నిర్వహించిన ఈవెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో విశ్వక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సేన్ మాట్లాడుతూ ‘ఇదొక మంచి ఫ్యామిలీ ఎంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టైనర్.  

అనుదీప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో  పని చేసిన తర్వాత నేను సినిమాని, జీవితాన్ని చూసే కోణం మారిపోయింది. తన రచన, హాస్యం భిన్నంగా ఉంటుంది. ఈ చిత్రం అందరికీ మంచి అనుభూతిని ఇస్తుంది’ అని అన్నాడు. ఈ చిత్రం కంప్లీట్ హిలేరియస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా ఉంటుందని కయాదు లోహర్ చెప్పింది. ప్రేక్షకులకు నవ్వులు పంచేలా సినిమా ఉంటుందని అనుదీప్ అన్నాడు.