సోనియా బుక్ ను పబ్లిష్ చేస్తం..హార్పర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కాలిన్స్ ఇండియా ప్రకటన

సోనియా బుక్ ను పబ్లిష్ చేస్తం..హార్పర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కాలిన్స్ ఇండియా ప్రకటన

న్యూఢిల్లీ: కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ ఆటోబయోగ్రఫీ బుక్ ప్రచురణపై నెలకొన్న వివాదం కొలిక్కి వచ్చింది. సోనియా గాంధీ ఆత్మకథ ‘బిలాంగింగ్: ఏ జర్నీ ఆఫ్ లవ్’ పుస్తకాన్ని తాము ప్రచురిస్తామని హార్పర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కాలిన్స్ ఇండియా ప్రకటించింది. ఈ పుస్తకం నవంబర్ 10న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. మొదట ఈ పుస్తకాన్ని ప్రచురించాల్సిన ‘పెంగ్విన్ రాండమ్ హౌస్ ఇండియా’ వెనక్కి తగ్గడంతో, ఇప్పుడు హార్పర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కాలిన్స్ ఇండియా ఆ బాధ్యతను తీసుకుంది. 

ఈ ఆత్మకథలో సోనియా గాంధీ ఇటలీలో తన బాల్యం, భారతదేశానికి రావడం, మాజీ ప్రధాని రాజీవ్ గాంధీతో పెండ్లి, భారత రాజకీయాల్లో ఆమె దశాబ్దాల ప్రయాణం వంటి ఎన్నో ఆసక్తికరమైన విషయాలు ఉండనున్నాయి. అయితే, ఈ పుస్తకంలో ప్రధాని నరేంద్ర మోదీ, ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్, భారత్, చైనా సంబంధాలకు సంబంధించిన కొన్ని అంశాలను తొలగించాలని పెంగ్విన్ ఇండియా కోరిందని, దానికి సోనియా గాంధీ బృందం అంగీకరించకపోవడంతోనే వివాదం చెలరేగిందని కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. 

అయితే, తమపై ఎలాంటి ఒత్తిళ్లు లేవని, కేవలం ఒక నిర్దిష్ట అంశంపై చర్చల సమయంలో ఏకాభిప్రాయం కుదరకపోవడం వల్లే తాము తప్పుకున్నట్టు పెంగ్విన్ ఇండియా స్పష్టం చేసింది.