Sonu Sood: ఇది నా తరపున చిన్న కృతజ్ఞత.. అజ్ఞాత అభిమాని పనికి సోనూసూద్ ఫిదా

Sonu Sood: ఇది నా తరపున చిన్న కృతజ్ఞత.. అజ్ఞాత అభిమాని పనికి సోనూసూద్ ఫిదా

సోనూసూద్‌(Sonu Sood).. ఈపేరుకు ప్రత్యేకమైన పరిచయం అవసరంలేదు. కరోనా కష్టకాలంలో ఎంతో మంచి దేవుడిలా సహాయం చేసిన గొప్ప వ్యక్తి. అందుకే ఆయనంటే చాలా మంది ఇష్టపడతారు. అప్పటివరకు ఒక నటుడిగానే తెలిసిన సోనూసూద్ ఆతరువాత నుండి గొప్ప మనసున్న వ్యక్తిగా పరిచయం అయ్యారు. అప్పటినుండి సోనూసూద్ పేరు సోషల్ మీడియా ఎదో రకంగా వైరల్ అవుతూనే ఉంది. ఇపుడు తాజాగా మరోసారి సోనూసూద్ పేరు ట్రెండ్ అవుతోంది. 

కారణం.. ఒక అజ్ఞాత అభిమాని సోనూసూద్ కు సర్‌ప్రైజ్‌ ఇచ్చారట. ఆ అభిమాని చేసిన చేసిన పనికి సోనూసూద్ తో పాటు, ఆయన కుటుంబం కూడా అవాక్కయ్యారట. ఈ విషయాన్నీ స్వయంగా సోనూసూద్ తన సోషల్ మీడియా వేదికగా తెలిపారు. ఇంతకీ అసలు విషయం ఏంటంటే..  ఇటీవల సోనూసూద్ తన కుటుంబంతో కలిసి ఒక రెస్టారెంట్‌కు వెళ్లారట. భోజనం చేసిన తరువాత బిల్ తీసుకోవడానికి ఎవరు ఆయన దగ్గరికి రావడం లేదట. దాంతో కౌంటర్ దగ్గరకు వెళ్లిన సోనూసూద్ బిల్ గురించి అడగగా.. తమ బిళ్ళను ఎవరో అజ్ఞాత వ్యక్తి చెల్లించాడని చెప్పారట.

అంతేకాదు.. సోనూసూద్ బిల్ కట్టిన ఆ అజ్ఞాత వ్యక్తి.. ఒక నోట్ కూడా పంపారట. ఆ నోట్ లో.. దేశం కోసం మీరు చేస్తున్న మంచి పనులకు నా తరపున ఇది చిన్న కృతజ్ఞత లాంటిది.. అని రాసిచ్చారట. ఆ నోట్ ఫోటోను తన సోషల్ మీడియాలో షేర్ చేశారు సోనూసూద్. ఈ పని ఎవరు చేశారో తెలియదు కానీ.. మా డిన్నర్‌ బిల్లు మొత్తం కట్టి ఈ స్వీట్‌ నోట్‌ను నాకు పంపాడు. ఆ వ్యక్తి నా హృదయాన్ని గెలుచుకున్నాడు.. అంటూ రాసుకొచ్చాడు సోనూసూద్. ప్రస్తుతం సోనూసూద్ చేసిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.