చెలరేగిన సౌతాఫ్రికా బౌలర్లు : శ్రీలంక203 ఆలౌట్

చెలరేగిన సౌతాఫ్రికా బౌలర్లు : శ్రీలంక203 ఆలౌట్

చెస్టర్ లీ స్ట్రీట్: వరల్డ్ కప్ -2019లో భాగంగా శుక్రవారం సౌతాప్రికాతో జరుగుతున్న మ్యాచ్ లో శ్రీలంక ఇన్నింగ్స్ ముగిసింది. ప్రారంభంలోనే వికెట్లు కోల్పోయిన లంక.. తక్కువ స్కోరుకే పరిమితమైంది. టాస్ ఓడి ఫస్ట్ బ్యాటింగ్ చేసిన లంక 49.03 ఓవర్లలో  203 రన్స్ కు ఆలౌటైంది. శ్రీలంక ప్లేయర్లలో ఏ ఒక్కరూ చెప్పుకోదగ్గ స్కోర్ చేయలేక పోయారు. సౌతాఫ్రికా కట్టుదిట్టమైన బౌలింగ్ కు వరుసపెట్టి పెవిలియన్ బాట పట్టారు లంకేయులు.

సౌతాఫ్రికా బౌలర్లలో.. ప్రిటోరియస్‌(3), క్రిస్‌మోరిస్‌(3) రబడ(2) జేపీ డుమిని(1), ఫెలుక్వాయో(1) వికెట్లు తీశారు.