సౌతాఫ్రికా స్టార్ ప్లేయర్ రిటైర్మెంట్..

సౌతాఫ్రికా స్టార్ ప్లేయర్ రిటైర్మెంట్..

సౌతాఫ్రికా స్టార్  ప్లేయర్ డు ప్లెసిస్ టెస్టు క్రికెట్ కు గుడ్ బై చెప్పాడు. వన్డే,టీ20లపై దృష్టి పెట్టేందుకే తాను టెస్టు క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటిస్తున్నాట్లు తన ఇన్ స్టాగ్రమ్ లో పోస్ట్ చేశాడు. తన రిటైర్మెంట్ కు ఇదే కరెక్ట్ టైం అని చెప్పాడు. అన్ని ఫార్మాట్లలో దేశం తరపున ఆడుతున్నందుకు గర్వంగా ఉందని..కానీ టెస్టు క్రికెట్ నుంచి తప్పుకునే సమయం వచ్చిందన్నారు. 69 టెస్టు మ్యాచ్ లకు కెప్టెన్ గా ఆడతానని ఎవరైనా 15 ఏళ్ల క్రితం చెప్పి ఉంటే నమ్మేవాడిని కాదన్నారు. వచ్చే రెండేళ్లలో జరగనున్న  జరగనున్న  ఐసీసీ, టీ20,వన్డే వరల్డ్ కప్ లపై ఫోకస్ పెడతానన్నారు. డు ప్లెసిస్ టెస్టు క్రికెట్ లో  69 టెస్టులాడి 4163 రన్స్ చేశాడు. ఇందులో  10 సెంచరీలు ఉన్నాయి. అత్యధిక స్కోరు 199 చేశాడు.

see more news

ఇల్లు కోసం కూడబెట్టిన రూ.5 లక్షలకు చెదలు

ఇదొక లైఫ్ టైం ఎక్స్ పీరియన్స్.. కిరణ్ బేడీ వీడ్కోలు ట్వీట్..

కేసీఆర్ అనుకుంటే అగ్రి చట్టాలను అడ్డుకోవచ్చు