Trisha: గంటల తరబడి గోడను చూస్తాడు.. విజయ్లో నచ్చని విషయం అదే అంటున్న త్రిష

Trisha: గంటల తరబడి గోడను చూస్తాడు.. విజయ్లో నచ్చని విషయం అదే అంటున్న త్రిష

సౌత్ స్టార్ త్రిష(Trisha) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. భాషతో సబందం లేకుండా గత రెండు దశాబ్దాలుగా వరుస సినిమాలు చేస్తూ ఆడియన్స్ ను అలరిస్తున్నారు త్రిష. ఆ మధ్య సినిమాలకు దూరంగా ఉన్న ఈ బ్యూటీ.. పొన్నియన్ సెల్వన్ తో మళ్లీ సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది. ఆ తరువాత వచ్చిన లియో సినిమాతో బ్లాక్ బస్టర్ ని అందుకుంది.

తాజాగా.. త్రిష 41వ పుట్టినరోజు జరుపుకుంది. దీంతో ఆమెకు ఫ్యాన్స్, సెలెబ్రెటీస్ సోషల్ మీడియా వేదికగా బర్త్డే విషెస్ తెలిపారు. ఇందులో భాగంగా త్రిషకు సంబంధించిన పాత ఇంటర్వ్యూ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దానికి కారణం.. ఆ ఇంటర్వ్యూలో త్రిష చేసిన తలపతి విజయ్ గురించి ఆసక్తికర కామెంట్స్ చేయడమే. ఈ వీడియోలో త్రిష విజయ్ గురించి మాట్లాడుతూ.. షూటింగ్ సమయంలో అందరూ సరదాగా గడుపుతుంటే.. విజయ్ మాత్రం పక్కకు వెళ్ళిపోయి ఓ మూలన కూర్చుని గంటల తరబడి గోడవైపు చూస్తూ ఉంటారు. సెట్‌లో చాలా సైలెంట్ గా ఉంటాడు. ఎవరితోను పెద్దగా మాట్లాడడు. విజయ్ లో నాకు నచ్చని విషయం ఏదైనా ఉందంటే అది ఇదే అంటూ.. చెప్పుకొచ్చింది త్రిష.

ఇక త్రిష సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం ఆమె తెలుగులో మెగాస్టార్ చిరంజీవి హీరోగా వస్తున్న విశ్వంభర సినిమాలో నటిస్తున్నారు. శోషియో ఫాంటసీ ఎలిమెంట్స్ తో పాన్ ఇండియా లెవల్లో వస్తున్న ఈ సినిమాను బింబిసారా ఫేమ్ వశిష్ట తెరకెక్కిస్తున్నాడు. యూవీ క్రియేషన్స్ సంస్థ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 10న ప్రేక్షకుల ముందుకు రానుంది.