క్రిటికల్ గానే ఎస్పీ బాలు ఆరోగ్యం

క్రిటికల్ గానే ఎస్పీ బాలు ఆరోగ్యం

చెన్నై: ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం హెల్త్ కండిషన్ క్రిటికల్ గానే ఉన్నట్లు డాక్టర్లు చెప్పారు. కరోనా సోకడంతో కొన్ని రోజులుగా ఆయన చెన్నైలోని ఎంజీఎం హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు. ‘ఎస్పీ బాల సుబ్రమణ్యంకు ఐసీయూలో వెంటిలేటర్, ఎక్మో సపోర్ట్తో  ట్రీట్మెంట్ కొనసాగిస్తున్నాం. నేషనల్, ఇంటర్నేషనల్ ఎక్స్ పర్ట్స్ ను  సంప్రదిస్తున్నాం. మా డాకర్ట్లటీమ్ ఆయన హెల్త్ కండిషన్ ను ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తోంది’ అని ఎంజీఎం హెల్త్ కేర్ మెడికల్ సర్వీసెస్ అసి స్టెంట్ డైరెక్టర్  అనురాధ భాస్కరన్ గురువారం రాత్రి విడుదల చేసిన బులెటిన్ లో పేర్కొన్నారు. తన తండ్రి హెల్త్ కండిషన్ లో ఎలాంటి మార్పు లేదని బాలు కుమారుడు ఎస్పీ చరణ్ ఒక వీడియోలో చెప్పారు. మెరుగైన ట్రీట్ మెంట్ అందిస్తున్నామని,హెల్త్ కండిషన్ లో ఎలాంటి మార్పు లేదన్నారు.