న్యూఢిల్లీ: ఎలాన్ మస్క్‌కు చెందిన స్పేస్‌ఎక్స్, తన 'స్టార్‌లింక్' శాటిలైట్ బ్రాడ్‌బ్యాండ్ సేవల కోసం భారత్‌లో సప్లయ్ చైన్ టీమ్‌ను సిద్ధం చేస్తోంది. దేశంలో వాణిజ్య కార్యకలాపాలు ప్రారంభించేందుకు అవసరమైన తుది రెగ్యులేటరీ అనుమతులు ఇంకా పెండింగ్‌లో ఉన్నప్పటికీ, సంస్థ హార్డ్‌వేర్ ఎకోసిస్టమ్ తయారీపై దృష్టి పెట్టింది.
స్పేస్‌ఎక్స్ బెంగళూరులో సప్లయ్ చైన్ ఇంజనీరింగ్, సోర్సింగ్ విభాగాల్లో కీలక ఉద్యోగ ప్రకటనలు జారీ చేసింది. ఇందులో ఇంజెక్షన్ మోల్డింగ్, వైర్‌లెస్ సిగ్నల్ ట్రాన్స్‌మిషన్/రిసెప్షన్‌కు సంబంధించిన 'ఆర్‌ఎఫ్ ఇంటిగ్రేషన్', స్టార్‌లింక్ ప్రొడక్ట్ డెవలప్‌మెంట్ రోల్స్‌తో పాటు గ్లోబల్ సప్లయ్ మేనేజర్ పోస్టులు ఉన్నాయి. ఈ టీమ్ లోకల్ తయారీదారులతో సమన్వయం చేసుకుంటూ, స్పేస్‌ఎక్స్ క్వాలిటీ స్టాండర్డ్స్‌కు అనుగుణంగా విడిభాగాల ఉత్పత్తిని పర్యవేక్షించనుంది.
గ్రామీణ, మారుమూల ప్రాంతాల్లో ఇంటర్నెట్ అంతరాలను తగ్గించేందుకు స్టార్‌లింక్ కీలకమని మస్క్ ఇప్పటికే స్పష్టం చేశారు. లైసెన్స్, గ్రౌండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సిద్ధమైనందున, తుది క్లియరెన్స్ రాగానే హార్డ్‌వేర్ డెలివరీలో ఎలాంటి జాప్యం లేకుండా వేగంగా సేవలు అందించేందుకే స్పేస్‌ఎక్స్ ఈ సన్నాహాలు చేస్తోంది.
