24 నిమిషాలు చనిపోయిన స్పెయిన్ మహిళ.. ఆమె చూసింది చెబితే షేకైపోతారు..!!

24 నిమిషాలు చనిపోయిన స్పెయిన్ మహిళ.. ఆమె చూసింది చెబితే షేకైపోతారు..!!

Life After Death: మనిషి చనిపోయాక ఏం జరుగుతుంది అనే అంశాల గురించి అనేక తెలుగు సినిమాల్లో చూసే ఉంటాం. పాపపుణ్యాలకు అనుగుణంగా స్వర్గం లేదా నరకానికి ఆత్మ వెళుతుందని.. ఇలా ఫిక్షన్ సీన్స్ కనిపిస్తూనే ఉంటాయి. అయితే వీటిలో వాస్తవం ఎంత అనే అంశాలపై మాత్రం ఎవ్వరికీ తెలియదు. కానీ కొన్ని నిమిషాల పాటు మరణించి బతికిన చాలా మంది చెప్పే కొన్ని విషయాలు, వారు చూసిన అంశాలు మనందరికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తుంటాయి. 

అయితే 50 ఏళ్ల టెస్సా రొమిరో అనే స్పానిష్ మహిళా జర్నలిస్ట్ తనకు ఎదురైన అనుభవాలను పంచుకున్నారు. ఆమె క్లినికల్ గా 24 నిమిషాల పాటు మరణించారు. అయితే ఆ సమయంలో ఆమె చూసిన విషయాలు ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. అయితే అవి మరణంతో జీవితం అంతం కాదు, ఇదొక చిన్న ట్రాన్సిషన్ ఫేజ్ మాత్రమేనని చెబుతోంది. ఒకరోజు రోజూమాదిరిగానే కూతురిని స్కూల్లో దింపి వచ్చిన ఆమె సడెన్ గా స్పృహ కోల్పోయారు. ఆ తర్వాత ఆసుపత్రికి తీసుకెళ్లగా మరణించినట్లు తేచ్చారు. అయితే డాక్టర్లు చేసిన ప్రయత్నంతో 24 నిమిషాల తర్వాత తిరిగి బ్రతికారు. 

ఆ సమయంలో తాను వేరే ప్రపంచంలోకి ఎంటర్ అయ్యానని చెప్పారు. తన భుజాలపై ఉన్న బరువు, బాధను తొలగించినట్లు అనిపించిందని చెప్పారు. తాను చలనం లేకుండా హాస్పిటల్ బెడ్డుపై పడిఉన్న తన శరీరాన్ని చూసినట్లు చెప్పారు. తాను చనిపోయినట్లు తనకు తెలియదని.. ఇంకా బ్రతికే ఉన్నట్లు భావన కలిగిందన్నారు. చనిపోయాక జీవించిన ప్రపంచాన్ని భిన్నంగా ఉన్నట్లు చెప్పారు. సమయం నెమ్మదిగా గడుస్తోందని, అంతా అర్థవంతంగా ఉన్నట్లు చెప్పారు. మరణం కొత్త జీవితం ఆరంభానికి ప్రారంభంగా అనిపించిందని జర్నలిస్ట్ చెప్పారు. 

తనకు ఒంటరిగా ఉన్నట్లుగా లేదా భయంగా అస్సలు అనిపించలేదని చెప్పారు. ప్రస్తుతం తాను ప్రశాతంగా జీవిస్తూ తనకు ప్రతిరోజూ ఒక వరంగా ఉందని చెప్పారు. తాను కొన్ని నిమిషాల పాటు మరణించినప్పుడు తనకు అర్థమైన విషయం చనిపోయాక కూడా మనం ఒంటరిగా ఉండమన్నదే అని టెస్సా చెప్పారు. మరణం జీవానికి అంతం కాదని మరో కొత్త అందరమైన రూపంలో జీవితాన్ని తిరిగి ప్రారంభించటానికి ఆరంభం అని తనకు అనిపించినట్లు మహిళా జర్నలిస్ట్ తన అనుభవాలను పంచుకున్నారు.