
హైదరాబాద్, వెలుగు: గ్రామ పంచాయతీల్లో ఈ నెల 7 నుంచి 14 వరకు స్పెషల్ డ్రైవ్ చేపట్టనున్నారు. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులను, గైడ్ లైన్స్ ను పంచాయతీ రాజ్ కమిషనర్ హనుమంతరావు శనివారం జారీ చేశారు.
పంచాయతీ సెక్రటరీలు, స్పెషల్ ఆఫీసర్లు వీటిని అమలు చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. గ్రామ పంచాయతీ కార్మికులతో నిత్యం రోడ్లను క్లీన్ చేయించాలని, పాత బావులను, గుంతలను పూడ్చివేయాలని, స్కూళ్లు, అంగన్ వాడీలను క్లీన్ గా ఉంచాలన్నారు. డ్రైనేజీలను క్లీన్ చేయటంతో పాటు బ్లీచింగ్ పౌడర్ చల్లాలన్నారు.