Spider-Man Box Office: ఇండియన్ బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న స్పైడర్ మ్యాన్.. రూ.500 కోట్లతో హాలీవుడ్ రికార్డ్ బ్రేక్!

Spider-Man Box Office: ఇండియన్ బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న స్పైడర్ మ్యాన్.. రూ.500 కోట్లతో హాలీవుడ్ రికార్డ్ బ్రేక్!

స్పైడర్ మ్యాన్‌కు ఉన్న క్రేజ్ ఏంటో మరోసారి ప్రూవ్ అయింది. మార్వెల్ నుంచి వచ్చిన లేటెస్ట్ సెన్సేషన్ 'స్పైడర్ మ్యాన్: బ్రాండ్ న్యూ డే' బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది. థియేటర్లలోకి వచ్చిన రోజు నుంచే వసూళ్ల వేట మొదలుపెట్టిన ఈ సినిమా.. ఇప్పుడు ఇండియన్ బాక్సాఫీస్ వద్ద ఏకంగా రూ.500 కోట్ల గ్రాస్ మార్క్‌ను దాటేసి చరిత్ర సృష్టించింది. దీంతో ఇండియాలో ఈ మైలురాయిని అందుకున్న తొలి హాలీవుడ్ చిత్రంగా '‘బ్రాండ్ న్యూ డే' నిలిచింది.

ఇప్పటికే ఇండియాలో 'అవెంజర్స్: ఎండ్‌గేమ్', 'అవతార్: ది వే ఆఫ్ వాటర్' వంటి భారీ హాలీవుడ్ చిత్రాలు సృష్టించిన రికార్డులను ఈ స్పైడర్ మ్యాన్ మూవీ బద్దలు కొడుతూ ముందుకు దూసుకెళ్తోంది. సినిమా రెండో వారంలోకి వెళ్లినా వసూళ్ల జోరు ఏమాత్రం తగ్గలేదు. ఇదే జోరు మూడో వారం కూడా కొనసాగుతుందని సినీ వర్గాలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి.

టామ్ హాలండ్ మరోసారి పీటర్ పార్కర్‌గా అదరగొట్టగా.. జెండయా, సాడీ సింక్, జాకబ్ బటలాన్, జాన్ బెర్న్‌థాల్, మార్క్ రఫాలో తదితరులు కీలక పాత్రల్లో కనిపించారు. డెస్టిన్ డేనియల్ క్రెట్టన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా.. ‘నో వే హోమ్’ తర్వాత పీటర్ పార్కర్ జీవితంలో వచ్చిన కొత్త మలుపులను చూపిస్తుంది. ప్రపంచం పీటర్ పార్కర్‌ను మర్చిపోయినా.. అతను మాత్రం తన గతాన్ని మర్చిపోలేని పరిస్థితి కథకు కీలకంగా మారింది. అదే సమయంలో అతడి శక్తుల్లో వస్తున్న అనూహ్య మార్పు, కొత్త ప్రమాదం కథను మరింత ఆసక్తికరంగా మార్చాయి.

►ALSO READ | Bigg Boss Telugu 10: బిగ్ బాస్ 10 హౌస్‌లోకి ఎంట్రీ అంత ఈజీ కాదు.. ముందు 'అగ్నిపరీక్ష'లో గెలవాల్సిందే!

ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ సినిమా దుమ్మురేపుతోంది.  లేటెస్ట్  రిపోర్టుల ప్రకారం 1.67 బిలియన్ డాలర్లను దాటిన గ్లోబల్ కలెక్షన్లతో భారీ బ్లాక్‌బస్టర్‌గా దూసుకెళ్తోంది. మొత్తానికి.. హాలీవుడ్ సినిమాలకు ఇండియన్ మార్కెట్ ఎంత కీలకమో మరోసారి నిరూపిస్తూ.. స్పైడర్ మ్యాన్ మాత్రం 'సూపర్ హీరో' కాదు.. బాక్సాఫీస్ హీరో కూడా అని ప్రూవ్ చేస్తున్నాడంటూ ఈమూవీ ప్రశంసలు అందుకుంటుంది.