ఆధ్యాత్మికం : కష్టాల్లోనూ సంతోషంగా ఉండటం ఎలా? – గౌతమ బుద్ధుడి జీవన సూత్రం!

ఆధ్యాత్మికం : కష్టాల్లోనూ సంతోషంగా ఉండటం ఎలా? – గౌతమ బుద్ధుడి జీవన సూత్రం!

"చుట్టూ ఉన్నవాళ్లు కష్టాల్లో ఉన్నా... నీకు ఎన్ని కష్టాలు ఎదురైనా, ఎంత బాధలో ఉన్నా ఆనందంగా, ఆరోగ్యంగా, ప్రశాంతంగా బతకాలి" అంటాడు గౌతమ బుద్ధుడు. ఇక్కడ ఆరోగ్యం అంటే బుద్దుని ఉద్దేశం సంపూర్ణత్వం. గాయం నుంచి కోలుకోవడం లేదా నయం కావడం నుంచే 'ఆరోగ్యం' అనే పదం కూడా పుట్టింది. గాయం నుంచి కోలుకున్న మనిషినే హెల్దీ పర్సన్ అంటాం. గాయం నుంచి కోలుకున్న మనిషే సంపూర్ణ మనిషి. బుద్దుడు చెప్పిన ఆరోగ్యానికి అసలు అర్ధం.. మెడికల్ టర్న్ ఆరోగ్యం కాదు. అది మెడిటేషనల్(ధ్యానం), మెడికల్, మెడిటేషన్ ఈ రెండు పదాల మూలం ఒకటే అంటే ఆశ్చర్యపోతారు.

మెడిసిన్ ఫిజికల్గా కోలుకునేలా చేస్తుంది. మెడిటేషన్ ఆధ్యాత్మికంగా నయమయ్యేలా చేస్తుంది. ఈ రెండూ నయం చేసే (హీలింగ్) పద్ధతులే! ఈ రెండూ ఆరోగ్యాన్ని తీసుకొస్తాయి. అయితే, బుద్దుడు ఫిజికల్ హెల్త్ గురించి మాట్లాడలేదు. ఆయన మన ఆత్మ ఆరోగ్యం గురించి మాట్లాడాడు. సంపూర్ణంగా బతికినప్పుడే ఆత్మ ఆరోగ్యంగా ఉంటుంది. సంతోషంగా బతకడమే సంపూర్ణత్వం.

"మీరు ఈ ప్రపంచాన్ని మార్చలేరు. మీ జీవితకాలం చాలా చిన్నది. తొందర్లోనే అది ముగిసిపోతుంది. ఈ ప్రపంచం మారి, అందరూ సంతోషంగా ఉన్నప్పుడే నేను సంతోషంగా ఉంటాను... అనే కండిషన్ తో బతికితే ఎప్పటికీ సంతోషంగా ఉండలేరు. అది ఎప్పటికీ జరగదు. ప్రపంచాన్ని మార్చే కెపాసిటీ మీకు లేదు" అంటాడు బుద్ధుడు.

ప్రపంచాన్ని మార్చలేం
"మీరు ఈ ప్రపంచాన్ని మార్చలేరు. మీ జీవితకాలం చాలా చిన్నది. తొందర్లోనే అది ముగిసిపోతుంది. ఈ ప్రపంచం మారి, అందరూ సంతోషంగా ఉన్నప్పుడే నేను సంతోషంగా ఉంటాను... అనే కండిషన్ తో బతికితే ఎప్పటికీ సంతోషంగా ఉండలేరు. అది ఎప్పటికీ జరగని పని. ప్రపంచాన్ని మార్చే కెపాసిటీ మీకు లేదు" అంటాడు బుద్ధుడు. 

నిజానికి ఈ లోకంలో మెజారిటీ మనుషులు బాధపడుతూ బతకాలని నిర్ణయించుకున్నారు. నిత్యం దుఃఖంలో మునిగి ఉండాలి. అదే వాళ్ల నిర్ణయం! మూడు, నాలుగు వందల ఏళ్ల కింద... నేటివ్ అమెరికన్స్ ఎవరి ఊహకూ అందనంత పేదరికంలో ఉన్నారు. వాళ్లకు భూమి ఉంది. ఈ ప్రపంచంలో ఉన్నట్లుగానే వాళ్లకు అదే నేల! కానీ, వాళ్లు ఎంచుకున్న టైఫ్ స్టయిల్ వాళ్లను పేదలుగా ఉంచింది. ఇప్పుడు అమెరికా రిచ్చేస్ట్ కంట్రీ! అదే దేశం కానీ, వేరే మనుషులు.. ఈ మనుషులు అమెరికా ఖండం తలరాతనే మార్చేశారు. పేద దేశాన్ని.. ధనిక దేశంగా మార్చేశారు. ఇదే మన దేశానికీ సాధ్యమవుతుంది. దీనికి ఇక్కడ ఉండే మనుషులు తమ ఆలోచనా తీరును, లైఫ్ స్టయిల్ ని చేంజ్ చేసుకోవాలి. 

వ్యతిరేకిస్తూ.. 
మనలో చాలామంది ధనవంతులు కావడాన్ని వ్యతిరేకిస్తుంటారు. అలాంటి వాళ్లు ఎలాధనవంతులు కాగలరు ? జీవితానికి యాంటీగా ఉంటే.. ఎలా బతకగలరు ? నా చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉంటేనే.. నేను సంతోషంగా ఉండగలను అనుకుంటే ఎప్పటికీ సంతోషంగా ఉండలేరని బుద్ధుడు సింపుల్ ఫ్యాక్ట్ చెప్పాడు. చుట్టూ ఉన్నవాళ్లు కష్టాల్లో ఉన్నా.. సంతోషంగా ఉండాలి అంటే.. వాళ్లకు సాయం చేయొద్దని అతని ఉద్దేశం కాదు. కానీ, మీరే బాధల్లో ఉంటే, మీరే జబ్బుతో ఉంటే వాళ్లకు సాయం చేయలేదని అర్థం.

►ALSO READ | నీతి కథలు: రాజు అహంకారం.. రాక్షసుడి హారంతో ప్రతీకారం తీర్చుకున్న తెలివైన కోతి!

దీన్నే టాల్ స్టాయ్ ఇలా చెప్తాడు. ప్రతి మనిషి ఈ ప్రపంచం మారాలని ఎదురు చూస్తుంటాడు, కోరుకుంటాడు, కలలుకంటాడు. కానీ, ఒక్కసారి కూడా తాను మారాలని అనుకోడు' అని అంటాడు. ముందు మనం మారకుండా ఈ ప్రపంచం మారే ఛాన్సే లేదు. ముందు నువ్వు సంతోషంగా ఉంటేనే.. ఇతరులను సంతోషంగా ఉంచగలవు.

ఎలా సాయం చేయగలరు?
పేదవాడిగా ఉంటూ, పేదవాళ్లకు ఎలా సాయం చేయగలం ? నువ్వు ధనవంతుడివి కాబట్టి, 'గొప్ప సెయింట్' అని పేదవాళ్లు అంతా అభిమానిస్తారు. కాబట్టి చుట్టూ ఎన్ని కష్టాలు ఉన్నా సంతోషంగా బతకాలి. అదే మనం ఇతరులకు చేసే సాయం ఇతరులకు చేసే సేవ. ముందు మనం మారాలి. మనల్ని మనం మార్చుకోవాలి. అప్పుడే మీరు ప్రశాంతంగా, సంతోషంగా, ఆరోగ్యంగా బతకాలి. ఆత్మ ఆరోగ్యంగా ఉండాలంటే సంతోషమనే ఆధ్యాత్మిక ఆహారం కావాలి. దాన్ని ధ్యానంతో అందిస్తారా ? జ్ఞానంతో అందిస్తారా ? అనేది మన ఇష్టం.

-ఓషో