మెగాస్టార్ చెయ్యి తాకింది.. మా జీవితం మారిపోయింది

మెగాస్టార్ చెయ్యి తాకింది.. మా జీవితం మారిపోయింది

యంగ్ హీరో శ్రీవిష్ణు(Sree Vishnu) హీరోగా వచ్చిన లేటెస్ట్ మూవీ సామజవరగమన(Samajavaragamana). అవుట్ అండ్ అవుట్ ఫ్యామిలీ అండ్ కామెడీ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ  సినిమాకు ప్రేక్షకుల నుండి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. మొదటి రోజు, మొదటి షోతోనే పాజిటీవ్ టాక్ సొంతం చేసుకున్న ఈ సినిమా.. అనూహ్యమైన కలెక్షన్స్ రాబడుతోంది. ఈమాత్రం అంచనాలు లేకుండా వచ్చిన ఈ సినిమా.. సూపర్ హిట్ సాధించడంతో తాజాగా సామజవరగమన సక్సెస్‌ సెలబ్రేషన్స్ నిర్వహించారు మేకర్స్. 

ఈ సంధర్బంగా హీరో శ్రీవిష్ణు మాట్లాడాడుతూ.. "సామజవరగమన ట్రైలర్‌ లాంచ్‌ చేసేటప్పుడు మెగాస్టార్(Megastar) చేయి నా గుండె మీద తాకింది. ఆ ఆటోగ్రాఫ్‌ నా గుండెపై ఎప్పుడైతే పడిందో అప్పటి నుంచే మా అందరి జాతకం మారిపోయింది రామ్ అబ్బరాజు నాకు కథ చెప్పినప్పుడే ఈ సినిమా ఖచ్చితంగా హిట్ అవుతుంది అనిపించింది. అందుకే ఈ సినిమాపై మా టీమ్ అంతా చాలా నమ్మకంగా ఉన్నాము. ఇక చిరంజీవి గారు ట్రైలర్ రిలీజ్ చేశాక సినిమాకు మంచి బజ్ వచ్చింది. ఈ సినిమాను అందరూ నువ్వు నాకు నచ్చావ్ సినిమాతో పోల్చుతుంటే.. చాలా సంతోషంగా ఉంది అంటూ" చెప్పుకొచ్చారు శ్రీవిష్ణు. ప్రస్తుతం శ్రీవిష్ణు చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. 

ఇక సామజవరగమన సినిమా విషయానికి వస్తే.. జూన్ 29న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రామ్ అబ్బరాజు దర్శకత్వం వహించిన ఈ సినిమాను.. ఏకే ఎంటర్టైన్మెంట్స్, హాస్య మూవీస్ పతాకంపై అనిల్ సుంకర, రాజేష్ దండ సంయుక్తంగా నిర్మించారు.