శ్రీవిష్ణు, మహిమా నంబియార్ జంటగా జానకిరామ్ మారెళ్ల రూపొందిస్తున్న చిత్రం ‘కామ్రేడ్ కళ్యాణ్’. కోన వెంకట్ సమర్పణలో వెంకటకృష్ణ కర్నాటి, సీతా కర్నాటి నిర్మిస్తున్నారు. 1992 ఆంధ్ర– ఒడిశా సరిహద్దు ప్రాంతం నేపథ్యంలో పీరియాడికల్ బ్యాక్‌డ్రాప్‌తో పాటు రొమాన్స్, ఎమోషన్స్‌తో రూపొందిస్తున్నారు. తాజాగా ఈ చిత్రాన్ని దసరా కానుకగా అక్టోబర్ 9న వరల్డ్‌వైడ్‌గా విడుదల చేయనున్నట్టు ప్రకటించారు.
దసరా సీజన్ ఈ చిత్రానికి బాగా కలిసొస్తుందని, ఇందులో శ్రీవిష్ణు కామ్రేడ్ పాత్రలో యాక్షన్‌తోపాటు హిలేరియస్‌గా ఎంటర్‌టైన్ చేయనున్నాడని మేకర్స్ తెలియజేశారు. రాధికా శరత్‌కుమార్, షైన్ టామ్ చాకో, ఉపేంద్ర లిమాయే కీలక పాత్రల్లో నటిస్తున్నారు. విజయ్ బుల్గానిన్ సంగీతం అందిస్తున్నాడు.
