సంథింగ్ ఈస్ కమింగ్.. మెగాస్టార్ చిన్న కూతురు ఇంట్రెసింగ్ పోస్ట్

సంథింగ్ ఈస్ కమింగ్.. మెగాస్టార్ చిన్న కూతురు ఇంట్రెసింగ్ పోస్ట్

మెగాస్టార్(Megastar) చిన్న కూతురు శ్రీజ(Sreeja) కీలక ప్రకటన చేయనుందా? ఆమె పెట్టిన పోస్ట్ చూస్తే నిజమేనని అనిపిస్తోంది. నిజానికి శ్రీజ గత కొన్నేళ్లుగా  తన పెళ్లి విషయాలతో ఎక్కువగా ఎక్కువగా వార్తల్లో నిలిచారు. ముందుగా ఒక వ్యక్తిని ప్రేమించి ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోయి పెళ్లి చేసుకుంది. తర్వాత కూతురు పుట్టాక.. కొన్ని కారణాల వల్ల అతనితో విడాకులు తీసుకుంది. దీంతో తిరిగి చిరంజీవి ఇంటికి వచ్చేసింది. తర్వాత కొంతకాలానికి యంగ్ హీరో కల్యాణ్ దేవ్‌తో శ్రీజకు రెండో పెళ్లి చేశారు చిరంజీవి. వీరికి కూడా ఓ పాప పుట్టింది. వీరిద్దరూ కూడా మనస్పర్థల వల్ల విడిపోయారని కొంతకాలంగా వార్తలు వినిపిస్తున్నాయి. కానీ ఈ వార్తలపై ఇరు కుటుంబాల నుండి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.

అయితే శ్రీజ మాత్రం కల్యాణ్ దేవ్‌కు దూరంగా తన కూతుర్లతో కలిసి ఉంటోంది. ఈ కారణంగానే వీరిద్దరూ కూడా విడాకులు తీసుకోనున్నారు అనే వార్తలు వైరల్ అయ్యాయి. ఈ క్రమంలోనే తాజాగా శ్రీజ పెట్టిన ఇంస్టా పోస్ట్ ఒకటి అనుమానాలకు దారితీస్తోంది. ఈ పోస్ట్ లో ఆమె.. సంథింగ్ ఈస్ కమింగ్.. అంటూ రాసుకొచ్చింది. దీంతో ఆమె కొత్తగా ఏదో గుడ్ న్యూస్ చెప్పబోతుందనే విషయం క్లియర్ గా తెసులుస్తోంది. దీంతో ఆమె చెప్పే ఆ గుడ్ న్యూస్ ఏమై ఉంటుందని తెలుసుకోవాలని తెగ ఆరాటపడ్తున్నారు నెటిజన్స్.