ఆ స్టార్తో కష్టమే అనుకున్నారు కానీ, బంపర్ ఆఫర్ కొట్టేసింది శ్రీలీల

ఆ స్టార్తో కష్టమే అనుకున్నారు కానీ, బంపర్ ఆఫర్ కొట్టేసింది శ్రీలీల

సౌత్ బ్యూటీ శ్రీలీల(Sreeleela)కు ప్రస్తుతం బ్యాడ్ టైం నడుస్తోంది. మొన్నటివరకు గోల్డెన్ లెగ్ అన్న ఆడియన్స్ ఇప్పుడు ఆమెను ఐరన్ లెగ్ అని కామెంట్స్ చేస్తున్నారు. కారణం.. ఆమె నటించిన సినిమాలు డిజాస్టర్స్ కావడమే. వాటిలో స్కంద, ఎక్స్ట్రా, ఆదికేశవ, గుంటూరు కారం సినిమాలు ఉన్నాయి. మంచి హైప్ తో ఈ సినిమాలు ప్లాప్ గా నిలిచాయి. అయినప్పటికి ఈ అమ్మడు క్రేజీ ఆఫర్స్ అందుకుంటోంది. ఇప్పటికే పవన్ కళ్యాణ్, విజయ్ దేవరకొండ, నవీన్ పోలిశెట్టితో సినిమాలు చేస్తున్న శ్రీలీల.. తాజాగా మరో బంపర్ ఆఫర్ కొట్టేసింది.

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా సీతరామం ఫేమ్ హను రాఘవపూడి దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నారు. రెండో ప్రపంచ యుద్ధం నేపధ్యంలో రానున్న ఈ పాన్ ఇండియా సినిమాను మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. త్వరలోనే అధికారిక ప్రకటన రానున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా ఈ సినిమా గురించి ఒక ఆసక్తికర న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ సినిమాలో ప్రభాస్ కు జోడీగా శ్రీలీలను తీసుకోనున్నారట మేకర్స్. దీనికి సంబందించిన చర్చలు కూడా ఇప్పటికే పూర్తయ్యాయని, శ్రీలీల కూడా వెంటనే ఒకే చెప్పేసింది టాక్.

నిజానికి టాలీవుడ్ టాప్ స్టార్స్ అందరితో జతకట్టిన శ్రీలీలకు ప్రభాస్ తో చేసే అవకాశం రాదనుకున్నారు చాలా మంది. కారణం.. ప్రభాస్ చేస్తున్న సినిమాల రేంజ్ అలాంటిది. ఆ రేంజ్ సినిమాల్లో నటించే అవకాశం శ్రీలీలకు రాదేమో అనుకున్నారంతా. కానీ, అనూహ్యంగా ప్రభాస్ తో జతకట్టే బంపర్ ఆఫర్ ను కొట్టేసింది ఈ బ్యూటీ. అది కూడా పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కుతున్న సినిమాలో. మరి ఇప్పటివరకు రీజనల్ సినిమాలతో మెప్పించిన శ్రీలీల.. పాన్ ఇండియా సినిమాతో ఎలాంటి రిజల్ట్ అందుకోనుందో చూడాలి.