మెగా ఛాన్స్ కొట్టేసిన శ్రీలీల

మెగా ఛాన్స్ కొట్టేసిన శ్రీలీల

టాలీవుడ్ లేటెస్ట్ బ్యూటీ సెన్సేషన్ శ్రీలీల మెగా ఛాన్స్ కొట్టేసింది. చిరు నెక్స్ట్ మూవీ కోసం ఈ బ్యూటీని ఫిక్స్ చేశారట మేకర్స్. భోళా శంకర్ షూటింగ్ కంప్లీట్ అవగానే ఈ క్రేజీ ప్రాజెక్ట్ మొదలుకానుంది. ఈ సినిమాలో శ్రీలీల పాత్ర కూడా చాలా ఇంట్రెస్టింగ్ ఉండనుందని సమాచం. ఇంతకీ అసలు విషయం ఏంటంటే.. మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం భోళా శంకర్ సినిమా షూటింగ్ లో ఫుల్ బిజీగా ఉన్నాడు. తమిళ హిట్ మూవీ వేదాలంకి రీమేక్ గా రానున్న ఈ మూవీని మెహర్ రమేష్ తెరకెక్కిస్తున్నాడు.

ఈ మధ్యే ఈ మూవీ కొత్త షెడ్యూల్ కోలకతాలో స్టార్ట్ అయ్యింది. ఆ షూటింగ్ కి సంబంధించిన ఫోటోస్ ని చిత్ర యూనిట్సోషల్ మీడియా వేధికాగా పంచుకుంది. మెగాస్టార్ టాక్సీ డ్రైవరు గా కనిపిస్తున్న ఈ ఫోటోస్ తెగ వైరల్ అవుతున్నాయి. ఈ సినిమా తరువాత.. చిరు సోగ్గాడే చిన్నినాయన ఫేమ్ కళ్యాణ్ కృష్ణతో ఓ సినిమా చేయనున్నాడు. ఈ ప్రాజెక్టుకి సంబంధించిన కథా చర్చలు కూడా ఇప్పటికే మొదలయ్యాయని సమాచారం.

ఇక ఈ సినిమాలో మెగాస్టార్ తో పాటు మరో యంగ్ హీరో కూడా నటించనున్నాడట. ఆ యంగ్ హీరో మరెవరో కాదు టాలెంటెడ్ హీరో సిద్దు జొన్నళగడ్డ.  సోషియో ఫాంటసీ ఎలిమెంట్స్ తో రానున్న ఈ మూవీలో సిద్దుకి పెయిర్ గా శ్రీలీలని తీసుకొనున్నారట. మరి మెగాస్టార్ కి జోడీగా ఎవరు నటించనున్నారు అనేదానిపై ఇంకా క్లారిటీ రాలేదు. చిరంజీవి పెద్ద కూతురు సుస్మిత నిర్మిస్తున్న ఈ సినిమా సెప్టెంబర్ లో సెట్స్ మీదకి వెళ్ళే అవకాశం ఉంది.