కెరీర్లో ఫస్ట్ టైమ్ లేడీ ఓరియెంటెడ్ జానర్లోశ్రీలీల..

కెరీర్లో ఫస్ట్ టైమ్ లేడీ ఓరియెంటెడ్ జానర్లోశ్రీలీల..

కెరీర్‌‌‌‌ ప్రారంభంలో గ్లామర్ రోల్స్ చేసిన చాలామంది హీరోయిన్స్‌‌ ఆ తర్వాత ఫిమేల్‌‌ సెంట్రిక్‌‌ సినిమాలతో మెప్పించారు. ఇప్పుడీ వరుసలో శ్రీలీల కూడా చేరబోతోంది. ‘భగవంత్ కేసరి’ లాంటి ఒకట్రెండు చిత్రాలు మినహా ఎక్కువగా గ్లామర్‌‌‌‌ రోల్స్‌‌లోనే కనిపించిన శ్రీలీల.. కెరీర్‌‌‌‌లో ఫస్ట్ టైమ్ లేడీ ఓరియంటెడ్‌‌ సినిమా చేయబోతోంది. నైంటీస్‌‌ బ్యాక్‌‌డ్రాప్‌‌లో రూపొందే ఈ పీరియాడికల్ మూవీతో రమేష్ ఎలిగేటి దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు.

 ‘రాజు వెడ్స్‌‌ రాంబాయి’ చిత్రంతో నిర్మాతగానూ మెప్పించిన దర్శకుడు వేణు ఊడుగుల.. వైజయంతి మూవీస్‌‌తో కలిసి ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నట్టు సమాచారం. 1994లో అప్పటి సీఎం ఎన్టీఆర్‌‌‌‌ మద్యపాన నిషేధాన్ని అమలు చేసిన తదనంతర పరిణామాల నేపథ్యంలో సాగే కామెడీ డ్రామా ఇదని తెలుస్తోంది. 

‘చుక్కలు తెమ్మన్నా తెంచుకురానా’ అనే టైటిల్‌‌ పరిశీలనలో ఉంది. హీరోయిన్‌‌గా మొదట భాగ్యశ్రీ బోర్సే, సాయిపల్లవిని అనుకున్నప్పటికీ శ్రీలీలను ఫైనల్‌‌ చేసినట్టు టాక్.  ప్రస్తుతం ఆమె హిందీలో ‘ఆషీకి 3’, తమిళంలో ధనుష్‌‌కు జంటగా ఓ సినిమా చేస్తోంది.