
గుంటూరు కారం సక్సెస్తో ఊపు మీద ఉన్న బ్యూటీ శ్రీలీల(Sreeleela).అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ అయ్యిందీ ముద్దుగుమ్మ. రాఘవేంద్రరావు దర్శకత్వంలో రూపొందిన ‘పెళ్లి సందD’ సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ బ్యూటీ, ఆ తర్వాత ఒక్కో సినిమాతో క్రేజ్ ను పెంచుకుంటూ టాలీవుడ్లో స్టార్ హీరోయిన్ గా ఎదిగింది.
ఇదిలా ఉండగా.. తాజాగా ఓ ఇంటర్వ్యూ లో పాల్గొన్న ఈ అమ్మడు తన గురించి నమ్మలేని నిజాన్ని బయట పెట్టింది..ఈ అమ్మడు మాట్లాడుతూ..‘నేనెప్పుడూ స్విచ్చాన్, స్విచ్చాఫ్ పర్సన్ లా ఉంటాను. అది నా బలంగా ఫీలవుతున్నాను. ఒకేరోజు మూడు సినిమాల్లో మూడు క్యారెక్టర్స్ చేయాల్సి వచ్చినా, ఏమాత్రం ఇబ్బంది పడను.
ఒక పాత్రలో నుంచి మరో పాత్రలోకి ఈజీగా ఒదిగిపోతాను. సెట్లో ఉన్నంత సేపు యాక్టింగ్ తప్ప మరో ధ్యాస ఉండదు. సెట్ నుంచి బయటకొచ్చానంటే సినిమా గురించి అస్సలు ఆలోచించను. సినిమాల్లోనే కాదు, చదవు విషయంలోనూ ఇలాగే ఉంటాను.’అంటోందీ అమ్మడు.
అయితే, గతేడాది శ్రీలీల నటించిన స్కంద, ఆదికేశవ, ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్ చిత్రాలు తీవ్రంగా నిరాశపరిచాయి. ఇటీవల వచ్చిన గుంటూరు కారం మూవీ కూడా ఆశించిన స్థాయిలో విజయం సాధించలేకపోయింది. ప్రస్తుతం మరో రెండు ప్రాజెక్టు లలో నటిస్తోంది. మరికొద్ది రోజుల్లో ఆమె నటించబోయే సినిమాలపై క్లారిటీ రానుంది.