హీరోయిన్ శ్రీలీల, క్రికెటర్ తిలక్ వర్మ డేటింగ్ రూమర్స్ వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. ఈ వార్త సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతూ అందరికీ షాక్ ఇస్తుంది. ఈ క్రమంలోనే లేటెస్ట్గా శ్రీలీల తల్లి డాక్టర్ స్వర్ణలత రియాక్ట్ అవుతూ పుకార్లకు అడ్డుకట్ట వేసింది.
అవన్నీ కేవలం ఊహాగానాలేనని, ఇద్దరూ ఇప్పటివరకు ఎక్కడ కలుసుకోలేదని క్లారిటీ ఇచ్చింది. అలాగే, శ్రీలీల ప్రస్తుతం చదువు, నటనలో బిజీగా ఉందని, నీట్-పీజీకి కూడా ప్రిపేర్ అవుతోందని తెలిపింది. ఈ క్రమంలోనే శ్రీలీల పెళ్లికి ఇంకా మరో ఐదారు సంవత్సరాల టైం ఉందని కూడా చెప్పి నటి తల్లి స్పష్టత ఇచ్చింది.
అంతేకాకుండా తిరుమల వెళ్లడం, వాంఖడే మ్యాచ్ని స్టేడియంకి వెళ్లి చూడటం వంటి అంశాలు ఉద్దేశపూర్వకంగా జరగలేదని తెలిపింది. ఇవే కారణాలను ఆధారంగా చేసుకుని ఇష్టం వచ్చినట్లు కథలు అల్లుకోవద్దని సూచించింది. ఇదే తరహాలో గతంలో కార్తిక్ ఆర్యన్‌తో వచ్చిన రూమర్స్‌ను కూడా ఖండించిన విషయాన్ని స్వర్ణలత గుర్తు చేశారు.
కార్తిక్ ఆర్యన్‌తో రూమర్స్..
కార్తిక్ ఆర్యన్‌తో వచ్చిన రూమర్స్‌పై స్పందిస్తూ శ్రీలీల తల్లి స్వర్ణలత స్పష్టత ఇచ్చారు. కార్తిక్ ఆర్యన్ తల్లి, తామిద్దరం గైనకాలజిస్టులమని, వృత్తిపరమైన పరిచయంతో వాళ్ళ ఇంటికి వెళ్లినట్లు తెలిపారు. ఆ పరిచయాన్ని తప్పుగా అర్థం చేసుకుని మీడియా అనవసరంగా డేటింగ్ రిలేషన్ అంటూ కథనాలు క్రియేట్ చేసిందని ఆమె అన్నారు.
ఇదే సమయంలో సెలబ్రిటీల వ్యక్తిగత జీవితాలపై ఎలాంటి ఆధారాలు లేకుండా సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని నమ్మవద్దని అభిమానులకు స్వర్ణలత సూచించారు. ఇకనైనా శ్రీలీల డేటింగ్ వార్తలకు చెక్ పడుతుందా ? లేదా అనేది తెలియాల్సి ఉంది.
శ్రీలీల కమింగ్ మూవీస్..
హీరోయిన్‌గా పరిచయమైన అతి కొద్దికాలంలోనే పాపులర్ అయిన శ్రీలీల.. వరుస స్టార్ హీరోల సినిమాలతో సెన్సేషనల్ అయింది. బ్యాక్ టు బ్యాక్ తొమ్మిది సినిమాల్లో చాన్స్‌లు అందుకుంది. అయితే అవకాశాలు వచ్చినంత ఈజీగా సక్సెస్ మాత్రం రాలేదు. అయినప్పటికీ, ప్రస్తుతం తెలుగు, తమిళం, హిందీ చిత్రాలతో ఫుల్ బిజీగా ఉంది. హిందీలో శ్రీలీల, కార్తీక్ ఆర్యన్ జంటగా ఆషిక్ 3 మూవీ రానుంది. దర్శకుడు అనురాగ్ బసు తెరకెక్కిస్తున్నాడు. ఈ చిత్రాన్ని టి-సిరీస్ బ్యానర్‌పై భూషణ్ కుమార్ నిర్మిస్తున్నారు. అలాగే తమిళ స్టార్ హీరో ధనుష్, ‘అమరన్’ మూవీ దర్శకుడు రాజ్‌కుమార్ పెరియసామి కాంబోలో వస్తున్న‘D55’ మూవీలో నటిస్తుంది.
