సక్సెస్, ఫెయిల్యూర్తో సంబంధం లేకుండా వరుస సినిమాలతో దూసుకెళ్తంది శ్రీలీల (Sreeleela) . తెలుగుతో పాటు ఇతర భాషల్లోనూ బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తోంది. ప్రస్తుతం హిందీలో కార్తీక్ ఆర్యన్కు జంటగా 'ఆషికీ 3', కోలీవుడ్లో ధనుష్కు జంటగా ఓ సినిమా చేస్తోంది.
ఇటు సౌత్, అటు నార్త్ అనే తేడా లేకుండా దూసుకెళ్తున్న శ్రీలీల.. తాజాగా బాలీవుడ్లో మరో క్రేజీ ప్రాజెక్టులో జాయిన్ అవుతున్నట్టు తెలుస్తోంది. బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ కొడుకు ఇబ్రహీం అలీ ఖాన్ నటిస్తున్న 'దిలేర్' చిత్రంలో శ్రీలీల హీరోయిన్గా సెలెక్ట్ అయ్యిందనే న్యూస్ వైరల్ అవుతోంది. త్వరలోనే ఆమె ఎంట్రీపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.
#SreeLeela was originally set to make her Bollywood debut opposite #KartikAaryan in Anurag Basu's Aashiqui 3.
— Filmyscoops (@Filmyscoopss) July 5, 2026
With the film facing long delays, reports suggest she could now make her Hindi debut with #IbrahimAliKhan's Diler instead. pic.twitter.com/drja1Lrm6B
కునాల్ దేశ్ ముఖ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని మ్యాడాక్ ఫిల్మ్స్ సంస్థ నిర్మిస్తుంది. శరవేగంగా షూటింగ్ జరుపుకుని ఈ ఏడాది దీపావళికి సినిమా రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తు చేసేలా ప్లాన్ చేస్తున్నారట మేకర్స్. అయితే శ్రీవీల ఇప్పటికే 'ఆషికీ 3'లో వటిస్తున్నప్పటికీ ఆ సినిమా కంటే ముందుగా 'విలేర్' విడుదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అదే జరిగితే, శ్రీవల బాలీవుడ్లో ప్రేక్షకుల ముందుకు వచ్చే తొలి చిత్రంగా నిలిచే అవకాశం ఉంది.
వాస్తవానికి, ఈ చిత్రం ఫస్ట్ లుక్‌ను ముందుగానే విడుదల చేయాలని నిర్మాతలు భావించారు. అయితే, అహాన్ పాండే, అనీత్ పడా నటించిన 'సయ్యారా' చిత్రంతో పోలికలు రాకుండా ఉండేందుకు దానిని వాయిదా వేసినట్లు సమాచారం. ఇబ్రహీం అలీ ఖాన్ ఇప్పటివరకు నటించిన రెండు చిత్రాలు 'నదానియాన్', 'సర్జమీన్' నేరుగా ఓటీటీలో విడుదలయ్యాయి.
Sreeleela and Ibrahim Ali Khan snapped together in bandra what’s cooking between them 🤔? #buzzzooka_events #sreeleela #ibrahimalikhan #bollywood #celebrity pic.twitter.com/Z3qhfTOcgB
— Buzzzooka Prime (@Buzzzookaprime) January 7, 2025
ఈ రెండు సినిమాల్లోనూ ఆయన నటనపై ప్రేక్షకులు, విమర్శకుల నుంచి మిశ్రమ స్పందన లభించగా, సోషల్ మీడియాలో ట్రోలింగ్ కూడా ఎదురైంది. ఈ నేపథ్యంలో థియేటర్లలో విడుదల కానున్న 'దిలేర్' చిత్రం ఇబ్రహీంకు కీలకంగా మారింది. ఓటీటీ చిత్రాల ద్వారా ఏర్పడిన ప్రతికూల అభిప్రాయాన్ని అధిగమించి, బాక్సాఫీస్ వద్ద తన సత్తా చాటుకోవాల్సిన సవాల్ ఆయన ముందుంది.
వాస్తవానికి, కార్తిక్ ఆర్యన్‌తో శ్రీలీల నటించిన చిత్రం 'దిలేర్' కంటే ముందే విడుదలై ఉంటే, ఆమె బాలీవుడ్ అరంగేట్రం మరింత బలంగా ఉండేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే, ఇప్పుడు ఇబ్రహీం అలీ ఖాన్ నటించిన 'దిలేర్' ముందుగా ప్రేక్షకుల ముందుకు రానుండటంతో, శ్రీలీల బాలీవుడ్ ఎంట్రీ వ్యూహంలో మార్పులు వచ్చినట్లు సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అయినప్పటికీ, తుది ఫలితం మాత్రం రెండు సినిమాల కంటెంట్, ప్రేక్షకుల ఆదరణపైనే ఆధారపడి ఉంటుంది.
