ప్రేయసిని పెళ్లాడిన SRH కెప్టెన్

ప్రేయసిని పెళ్లాడిన SRH కెప్టెన్

దక్షిణాఫ్రికా క్రికెటర్‌, సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌(ఎస్ఆర్‌హెచ్) సారథి ఎయిడెన్‌ మార్క్రమ్‌ వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. తన చిరకాల స్నేహితురాలు నికోల్‌ను మార్క్రమ్‌ పెళ్లాడారు. శనివారం సెంచూరియన్‌లోని ఓ పంక్షన్‌ హాల్‌లో వీరి వివాహం జరిగింది. అందుకు సంబంధించిన ఫోటోలను మార్క్రమ్‌ తన ఇన్‌స్టా ఖాతాలో పోస్ట్ చేశారు.

10 ఏళ్ల ప్రేమ

ఎయిడెన్‌ మార్క్రమ్, నికోల్‌లు గత పదేళ్ళుగా రిలేషన్‌షిప్‌లో ఉన్నారు. గ‌తేడాది వీరి నిశ్చితార్ధం జరిగింది. ఈ విష‌యం తెలిసిన అభిమానులు, ప‌లువురు క్రికెట‌ర్లు కొత్త జంట‌కు శుభాకాంక్ష‌లు తెలియ‌జేస్తున్నారు. ఇక నికోల్ విష‌యానికి వ‌స్తే.. ఆమె ఆన్‌లైన్‌ వేదికగా సొంతంగా ఓ జ్యువెల‌రీ స్టోర్‌ను నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది.

సన్‌రైజర్స్‌ సారథిగా విఫలం

ఐపీఎల్‌లో తొలిసారి సన్‌రైజర్స్‌ కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన మార్క్రమ్‌.. జట్టును విజయపథంలో నడిపించలేకపోయారు. అతని సారథ్యంలో ఎస్‌ఆర్‌హెచ్‌ 14 మ్యాచుల్లో 4 విజయాలు సాధించి పాయింట్ల పట్టికలో ఆఖరి స్ధానంలో నిలిచింది. అయితే సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో ఎస్‌ఆర్‌హెచ్‌ ఫ్రాంచైజీ సన్‌రైజర్స్ కేప్‌టౌన్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న మార్కరమ్‌ ఆ జట్టును ఛాంపియన్‌గా నిలబెట్టారు.