అఫ్గానిస్తాన్‌‌‌‌తో ఏకైక టెస్ట్‌‌‌‌లో శ్రీలంక 410/6

అఫ్గానిస్తాన్‌‌‌‌తో ఏకైక టెస్ట్‌‌‌‌లో శ్రీలంక 410/6

కొలంబో: అఫ్గానిస్తాన్‌‌‌‌తో ఏకైక టెస్ట్‌‌‌‌లో శ్రీలంక భారీ స్కోరు దిశగా సాగుతోంది. ఏంజెలో మాథ్యూస్‌‌‌‌ (141), దినేశ్‌‌‌‌ చండిమల్‌‌‌‌ (107) సెంచరీలతో చెలరేగడంతో.. శనివారం రెండో రోజు ఆట ముగిసే టైమ్‌‌‌‌కు లంక తొలి ఇన్నింగ్స్‌‌‌‌లో 101.2 ఓవర్లలో 410/6 స్కోరు చేసింది.

సమరవిక్రమ (21 బ్యాటింగ్‌‌‌‌) క్రీజులో ఉన్నాడు. 80/0 ఓవర్‌‌‌‌నైట్‌‌‌‌ స్కోరుతో ఆట కొనసాగించిన లంక బ్యాటర్లు.. అఫ్గాన్‌‌‌‌ బౌలింగ్‌‌‌‌ను చితక్కొట్టారు. మాథ్యూస్‌‌‌‌, చండిమల్‌‌‌‌ నాలుగో వికెట్‌‌‌‌కు 232 రన్స్‌‌‌‌ జోడించారు. నవీన్‌‌‌‌ జద్రాన్‌‌‌‌, క్వైస్‌‌‌‌ అహ్మద్‌‌‌‌ చెరో రెండు వికెట్లు తీశారు. అఫ్గానిస్తాన్‌‌‌‌ తొలి ఇన్నింగ్స్‌‌‌‌లో 62.4 ఓవర్లలో 198 రన్స్‌‌‌‌కు ఆలౌటైంది. ప్రస్తుతం లంక 212 రన్స్‌‌‌‌ లీడ్‌‌‌‌లో కొనసాగుతోంది.