అసలంక అదుర్స్‌‌‌‌‌‌‌‌ .. ఆసియా కప్‌‌‌‌‌‌‌‌లో శ్రీలంక బోణీ

అసలంక అదుర్స్‌‌‌‌‌‌‌‌ .. ఆసియా కప్‌‌‌‌‌‌‌‌లో శ్రీలంక బోణీ

పల్లెకెలె:  ఆల్‌‌‌‌‌‌‌‌రౌండ్‌‌‌‌‌‌‌‌ షోతో అదరగొట్టిన శ్రీలంక.. ఆసియా కప్‌‌‌‌‌‌‌‌లో బోణీ చేసింది. చిన్న టార్గెట్‌‌‌‌‌‌‌‌ ఛేజింగ్‌‌‌‌‌‌‌‌లో చరిత్‌‌‌‌‌‌‌‌ అసలంక (92 బాల్స్‌‌‌‌‌‌‌‌లో 5 ఫోర్లు, 1 సిక్స్‌‌‌‌‌‌‌‌తో 62 నాటౌట్‌‌‌‌‌‌‌‌), సమరవిక్రమ (77 బాల్స్‌‌‌‌‌‌‌‌లో 6 ఫోర్లతో 54) హాఫ్‌‌‌‌‌‌‌‌ సెంచరీలతో చెలరేగడంతో.. గురువారం జరిగిన గ్రూప్‌‌‌‌‌‌‌‌–బి తొలి మ్యాచ్‌‌‌‌‌‌‌‌లో లంక 5 వికెట్ల తేడాతో బంగ్లాదేశ్‌‌‌‌‌‌‌‌ను ఓడించింది. టాస్‌‌‌‌‌‌‌‌ గెలిచిన బంగ్లాదేశ్‌‌‌‌‌‌‌‌ 42.4 ఓవర్లలో 164 రన్స్‌‌‌‌‌‌‌‌కే కుప్పకూలింది. నజ్ముల్‌‌‌‌‌‌‌‌ హుస్సేన్‌‌‌‌‌‌‌‌ శాంటో (122 బాల్స్‌‌‌‌‌‌‌‌లో 7 ఫోర్లతో 89) టాప్​ స్కోరర్​. తర్వాత శ్రీలంక 39 ఓవర్లలో 165/5 స్కోరు చేసింది. పతిరణకు ‘ప్లేయర్‌‌‌‌‌‌‌‌ ఆఫ్‌‌‌‌‌‌‌‌ ద మ్యాచ్‌‌‌‌‌‌‌‌’ అవార్డు లభించింది. 

పతిరణ జోరు..

పిచ్‌‌‌‌‌‌‌‌ బౌన్స్‌‌‌‌‌‌‌‌కు అనుకూలంగా ఉండటంతో లంక పేసర్‌‌‌‌‌‌‌‌ మతీశా పతిరణ (4/32) అదరగొట్టగా, రెండో ఓవర్‌‌‌‌‌‌‌‌లోనే మహీశ్‌‌‌‌‌‌‌‌ తీక్షణ (2/19)ను తీసుకొచ్చి లంక కెప్టెన్‌‌‌‌‌‌‌‌ షనక వేసిన వ్యూహం అద్భుతంగా వర్కౌట్‌‌‌‌‌‌‌‌ అయ్యింది. రెండో బాల్‌‌‌‌‌‌‌‌కే తన్జిద్‌‌‌‌‌‌‌‌ హసన్‌‌‌‌‌‌‌‌ (0)ను ఔట్‌‌‌‌‌‌‌‌ చేసిన తీక్షణ.. 11వ ఓవర్‌‌‌‌‌‌‌‌లో కెప్టెన్‌‌‌‌‌‌‌‌ షకీబ్‌‌‌‌‌‌‌‌ (5)ను పెవిలియన్‌‌‌‌‌‌‌‌కు పంపాడు. మధ్యలో మహ్మద్‌‌‌‌‌‌‌‌ నయీమ్‌‌‌‌‌‌‌‌ (16)ను డిసిల్వా (1/35) బోల్తా కొట్టించడంతో బంగ్లా 36/3తో కష్టాల్లో పడింది. ఈ దశలో శాంటో, తౌహిడ్‌‌‌‌‌‌‌‌ హ్రిదోయ్‌‌‌‌‌‌‌‌ (20).. 14 ఓవర్ల పాటు నెమ్మదిగా ఆడి నాలుగో వికెట్‌‌‌‌‌‌‌‌కు 59 రన్స్‌‌‌‌‌‌‌‌ జత చేశారు. బంగ్లా ఇన్నింగ్స్‌‌‌‌‌‌‌‌ కోలుకుంటున్న దశలో షనక (1/16) నేరుగా రంగంలోకి దిగాడు. 24వ ఓవర్‌‌‌‌‌‌‌‌లో హ్రిదోయ్‌‌‌‌‌‌‌‌ను ఎల్బీ చేశాడు. ఆ వెంటనే పతిరణ దెబ్బకు ముష్ఫికర్‌‌‌‌‌‌‌‌ రహీమ్‌‌‌‌‌‌‌‌ (13) వెనక్కి రావడంతో 127 రన్స్‌‌‌‌‌‌‌‌కే సగం వికెట్లు పడ్డాయి. లంక మిగతా బౌలర్ల దెబ్బకు బంగ్లా లోయర్‌‌‌‌‌‌‌‌ ఆర్డర్‌‌‌‌‌‌‌‌లో ఒక్కరు కూడా డబుల్‌‌‌‌‌‌‌‌ డిజిట్‌‌‌‌‌‌‌‌ స్కోరును చేయలేకపోయారు. మెహిదీ హసన్‌‌‌‌‌‌‌‌ మిరాజ్‌‌‌‌‌‌‌‌ (5), మెహిదీ హసన్‌‌‌‌‌‌‌‌ (6), టస్కిన్‌‌‌‌‌‌‌‌ అహ్మద్‌‌‌‌‌‌‌‌ (0), ముస్తాఫిజుర్‌‌‌‌‌‌‌‌ రెహమాన్‌‌‌‌‌‌‌‌ (0) వరుస విరామాల్లో ఔట్‌‌‌‌‌‌‌‌ కావడంతో బంగ్లా భారీ స్కోరు చేయలేదు. 

ఇద్దరే కొట్టిన్రు..

చిన్న టార్గెట్‌‌‌‌‌‌‌‌ను లంక నిలకడగా ఛేదించింది. ఆరంభంలో బంగ్లా బౌలర్లు పట్టు బిగించే ప్రయత్నం చేసినా, మిడిలార్డర్‌‌‌‌‌‌‌‌లో సమరవిక్రమ, అసలంక హాఫ్‌‌‌‌‌‌‌‌ సెంచరీలతో వాళ్ల ఆశలను అడ్డుకున్నారు. టాప్‌‌‌‌‌‌‌‌ ఆర్డర్‌‌‌‌‌‌‌‌లో పాథుమ్‌‌‌‌‌‌‌‌ నిశాంక (14), దిముత్‌‌‌‌‌‌‌‌ కరుణరత్నె (1), కుశాల్‌‌‌‌‌‌‌‌ మెండిస్‌‌‌‌‌‌‌‌ (5) తక్కువ స్కోరుకే ఔట్‌‌‌‌‌‌‌‌కావడంతో లంక 43/3తో ఎదురీత మొదలుపెట్టింది. ఈ దశలో సమరవిక్రమ, అసలంక బంగ్లా బౌలింగ్‌‌‌‌‌‌‌‌ను దీటుగా ఎదుర్కొన్నారు. భారీ షాట్లకు పోకుండా స్ట్రయిక్‌‌‌‌‌‌‌‌ను రొటేట్‌‌‌‌‌‌‌‌ చేస్తూ వికెట్లను కాపాడుకున్నారు. ఈ క్రమంలో ఇద్దరూ హాఫ్‌‌‌‌‌‌‌‌ సెంచరీలతో నాలుగో వికెట్‌‌‌‌‌‌‌‌కు 78 రన్స్‌‌‌‌‌‌‌‌ జత చేసి ఇన్నింగ్స్‌‌‌‌‌‌‌‌ను పటిష్టం చేశారు. అయితే 30వ ఓవర్‌‌‌‌‌‌‌‌లో మెహిదీ హసన్‌‌‌‌‌‌‌‌ (1/35) బౌలింగ్‌‌‌‌‌‌‌‌లో సమరవిక్రమ స్టంపౌటయ్యాడు. తర్వాతి ఓవర్‌‌‌‌‌‌‌‌లో ధనంజయ్‌‌‌‌‌‌‌‌ డిసిల్వా (2) ఔట్‌‌‌‌‌‌‌‌కావడంతో లంక ఇన్నింగ్స్‌‌‌‌‌‌‌‌ 128/5తో కొద్దిగా పట్టు తప్పింది. కానీ అప్పటికే క్రీజులో పాతుకుపోయిన అసలంక, కెప్టెన్‌‌‌‌‌‌‌‌ షనక (14 నాటౌట్‌‌‌‌‌‌‌‌)తో కలిసి ఒక్కో రన్‌‌‌‌‌‌‌‌ జోడిస్తూ 66 బాల్స్‌‌‌‌‌‌‌‌ మిగిలి ఉండగానే విజయాన్ని అందించాడు.