మానవ మృగాలకు శ్రీరెడ్డి దొరికిపోయింది

మానవ మృగాలకు శ్రీరెడ్డి దొరికిపోయింది

నటి శ్రీరెడ్డి పేరుతో టాలీవుడ్‌లో ఓ సినిమా తెరకెక్కుతోంది. ఆర్యన్‌, ఉపాసన జంటగా రాహుల్‌ పరమహంస దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకి ‘శ్రీరెడ్డి దొరికిపోయింది’ అనే టైటిల్ ఫిక్స్ చేశారు. మానవ మృగాలకు అనేది ట్యాగ్ లైన్. న్యూఇయర్‌ కానుకగా బుధవారం మూవీ ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ను రిలీజ్ చేసింది యూనిట్.

ప్రస్తుతం ఈ టైటిల్‌ కాస్త వెరైటీగా ఉండటంతో సోషల్‌ మీడియాలో వైరల్‌ గా మారింది. సస్పెన్స్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ మూవీని డి. వెంకటేష్‌ నిర్మిస్తున్నారు. గణేశ్‌ రాఘవేంద్ర సంగీతమందిస్తున్నారు. అయితే ఈ సినిమాకు శ్రీరెడ్డికి సంబంధలేకపోయినప్పటికీ.. టైటిల్‌ పై ఆమె అభ్యంతరం తెలిపే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.