టాలెంటెడ్ హీరో శ్రీవిష్ణు వరుస విజయాలతో దూసుకుపోతున్నారు. సామజవరగమన, ఓం భీమ్ బుష్, శ్వాగ్, సింగిల్ వంటి వరుస సూపర్ హిట్స్ తర్వాత, లేటెస్ట్గా విష్ణు విన్యాసంతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. ఇవాళ శుక్రవారం (ఫిబ్రవరి 27న) మూవీ గ్రాండ్గా థియేటర్లలలో విడుదలైంది.
యూ/ఏ సర్టిఫికెట్తో ఆడియన్స్ ముందుకొచ్చిన ఈ మూవీ, కేవలం 1 గంట 59 నిమిషాల నిడివితోనే వచ్చింది. ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజైన ట్రైలర్, సాంగ్స్ సినీ ప్రియులను విశేషంగా ఆకట్టుకున్నాయి.
ఈ క్రమంలోనే, ఫిబ్రవరి 26న రాత్రి ఓవర్సీస్‌లో ప్రీమియర్ షోస్ పడ్డాయి. ఈ సందర్భంగా విష్ణు విన్యాసంపై ఆడియన్స్ ఎలా ఫీల్ అవుతున్నారు? X (ట్విట్టర్)లో నెటిజన్లు ఎలాంటి రివ్యూలు ఇస్తున్నారు? అనేది తెలుసుకుందాం.
టాక్ ఎలా ఉందంటే?
భారీ అంచనాలతో థియేటర్లలోకి వచ్చిన విష్ణు విన్యాసం మూవీ పాజిటివ్ టాక్ అందుకుంది. డైరెక్టర్ యదునాథ్ మారుతీ రావు ఫుల్ లెంగ్త్ ఎంటర్‌టైనర్‌గా విష్ణు విన్యాసం తెరకెక్కించారని ఓవర్సీస్ ఆడియన్స్ అంటున్నారు. హీరో శ్రీవిష్ణు మరోసారి తన కామెడీ టైమింగ్‌తో ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించాడని టాక్ వినిపిస్తోంది.
వాస్తును ఫాలో అయ్యే వ్యక్తిగా విష్ణు సందడి చేశారని చెబుతున్నారు. శ్రీవిష్ణు మార్క్ సెటైరికల్ డైలాగ్స్, రొమాన్స్, కామెడీ టైమింగ్ హైలైట్ గా నిలిచిందని ఓవర్సీస్ ఆడియన్స్ రివ్యూలు ఇస్తున్నారు.
మొత్తంగా విష్ణు విన్యాసం.. శ్రీవిష్ణు నుంచి వచ్చిన స్ట్రెస్ ఫ్రీ సినిమా అని, ఆద్యంతం నవ్వుకోవచ్చని సోషల్ మీడియాలో ట్వీట్స్ చేస్తున్నారు. అయితే, మీమ్ రిఫరెన్స్‌లు మరియు మీమ్ మ్యూజిక్‌ను ఎక్కువగా వాడటం వల్ల కథ కొంచెం బోర్‌గా అనిపించే ఛాన్స్ ఉందని కొందరు అభిప్రాయపడుతున్నారు
ఈ సందర్భంగా Xలో ఓ నెటిజన్ తన రివ్యూ పంచుకున్నాడు. ‘‘ బ్రో.. అసలు ఎలా బ్రో. నవ్వి నవ్వి పోయేలా ఉన్న. ఫస్టాఫ్ అదిరిపోయింది. అందరి యాక్టింగ్ సూపర్బ్. హీరో శ్రీవిష్ణు-హీరోయిన్ నయన్ సారిక కెమిస్ట్రీ స్క్రీన్‌పై చాలా బాగుంది. ముఖ్యంగా శ్రీవిష్ణు కామెడీ పీక్స్‌లో ఉంది” అని పంచుకున్నారు.
Dubbing star anni pettali @sreevishnuoffl bro ki ela bro asala navvi navvi poya la unna😂good 1st half performances by #SreeVishnu and #NayanSarika so good she looks too good on screen😍 comedy peaks undhi asala needs strong 2nd half chudam as of now it’s 4/5 ❤️🔥#VishnuVinyasam 🤣 https://t.co/YMR4HswVtn
— urstrulynameisHEM (@_mr_hem_) February 26, 2026
మరో నెటిజన్ తన రివ్యూ షేర్ చేస్తూ.. ‘‘సెకండాఫ్ మంచి ఫ్లోలో వెళుతుంది. కామిడీ వర్కవుట్ అవుతుంది. ప్రీ క్లైమాక్స్ లవ్ స్టోరీ బాగుంది. ఎండ్ కార్డ్ కామిడీ పంచ్‌లు బాగుంటాయ్. మంచి క్లైమాక్స్ తో థియేటర్స్ నుండి ఆడియన్స్ బయటికొస్తారు. ఫైనల్ గా శ్రీ విష్ణు నుండి మంచి స్ట్రెస్ ఫ్రీ సినిమా ఇది. విష్ణు విన్యాసానికి వెళ్లి అలా రిలాక్స్ అయ్యి రావొచ్చు” అని తెలిపారు.
Second half ✅️🔥
— Harsha 🐾 (@ever_cinephile) February 26, 2026
Goes with floww ....comidie workout avutundi 💯✅️
Pre climax love story baguntundi ❤️
Good climax 👍 .. end card comidie punches baguntai ...@sreevishnuoffl anna nunchi manchi stress free cinema ... velli alla relax eiye ravachu 💯💯#VishnuVinyasam https://t.co/BxMl0o5ewl
