జనజీవన స్రవంతిలో కామ్రేడ్ కళ్యాణ్

జనజీవన స్రవంతిలో కామ్రేడ్ కళ్యాణ్

శ్రీవిష్ణు హీరోగా జానకిరామ్ మారెళ్ల  రూపొందించిన చిత్రం ‘కామ్రేడ్ కళ్యాణ్’. కోన వెంకట్ సమర్పణలో   వెంకటకృష్ణ కర్నాటి, సీతా కర్నాటి నిర్మించారు. అక్టోబర్ 9న విడుదలైన ఈ చిత్రం ఇప్పటికీ విజయవంతంగా ప్రదర్శితమవుతోందని టీమ్ చెప్పింది. తాజాగా  నిర్వహించిన ప్రెస్‌‌‌‌‌‌‌‌మీట్‌‌‌‌‌‌‌‌కు అతిథులుగా హాజరైన దర్శకులు హరీష్ శంకర్, వీఎన్ ఆదిత్య, ఆర్.నారాయణ మూర్తి  టీమ్ అందరికీ సక్సెస్  షీల్డ్స్ అందజేశారు. 

ఈ సందర్భంగా శ్రీవిష్ణు మాట్లాడుతూ ప్రేక్షకులు ఇచ్చిన  ఈ  విజయం  చాలా ఆనందాన్ని ఇచ్చిందని అన్నాడు. నలుగురితో మొదలైన ఈ సినిమా 50 లక్షల మందికిపైగా చేరువైందని కోన వెంకట్ అన్నారు.  దర్శకుడిగా తనకు వచ్చిన   ఫస్ట్   హిట్ ఎప్పటికీ గుర్తుండిపోతుంది అని జానకిరామ్ అన్నాడు.  

ప్రొడ్యూసర్ వెంకట కృష్ణ మాట్లాడుతూ ‘మేము పడిన కష్టానికి ప్రేక్షకులు  మంచి ఫలితాన్ని ఇచ్చారు. థియేటర్ విజిట్ చేస్తున్నప్పుడు వాళ్లు ఇచ్చిన రెస్పాన్స్ చూస్తుంటే ఈ జీవితానికి ఇది చాలు అనిపించింది. ‘కామ్రేడ్ కళ్యాణ్’ జనజీవన స్రవంతిలో కలిశాడు.  జనాలు మాకు రూ. 30 కోట్ల రివార్డు ఇచ్చారు’ అని అన్నారు.