లవ్ కాంప్లికేషన్స్తో హైకూ

లవ్ కాంప్లికేషన్స్తో హైకూ

‘కోర్ట్‌‌‌‌‌‌‌‌’ ఫేమ్ శ్రీదేవి, ఏగన్‌‌‌‌‌‌‌‌, ఫెమినా జార్జ్‌‌‌‌‌‌‌‌ లీడ్ రోల్స్‌‌‌‌‌‌‌‌లో నటిస్తున్న చిత్రం ‘హైకూ’.  యువరాజ్ చిన్నసామి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని  డా. డి. అరుళానందు, మాథేవో అరుళానందు నిర్మిస్తున్నారు. అక్టోబర్ 23న తెలుగు, తమిళ భాషల్లో  సినిమా విడుదల కానుంది. 

ఈ సందర్భంగా హైదరాబాద్‌‌‌‌‌‌‌‌లో నిర్వహించిన ప్రెస్‌‌‌‌‌‌‌‌మీట్‌‌‌‌‌‌‌‌కు రైటర్ కోన వెంకట్,  డైరెక్టర్ రామ్ జగదీశ్ అతిథులుగా హాజరై ఈ సినిమా సక్సెస్ సాధించాలని కోరుతూ టీమ్‌‌‌‌‌‌‌‌కు బెస్ట్ విషెస్ చెప్పారు. ఈ సందర్భంగా శ్రీదేవి మాట్లాడుతూ ‘లవ్‌‌‌‌‌‌‌‌లో ఉన్నా, రిలేషన్ షిప్‌‌‌‌‌‌‌‌లో ఉన్నా, మ్యారీడ్ కపుల్ అందరికీ ఈ సినిమా నచ్చుతుంది. 

లవ్‌‌‌‌‌‌‌‌లో ఉన్న కాంప్లికేషన్స్ మొత్తం ఈ సినిమాలో చూస్తారు’ అని చెప్పింది. ఈ చిత్రం ప్రతి ఒక్కరికీ కనెక్ట్ అవుతుందని నటుడు ఏగన్ అన్నాడు. ఈ సినిమా విజయంపై నమ్మకంగా ఉన్నామని దర్శక నిర్మాతలు అన్నారు.