క్రైమ్ కామెడీతో థ్రిల్ చేసే శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్

క్రైమ్ కామెడీతో థ్రిల్ చేసే శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్

వెన్నెల కిషోర్(Vennela Kishore), అనన్య నాగళ్ల(Ananya Nagalla) ప్రధాన పాత్రల్లో రైటర్ మోహన్(Mohan) దర్శకత్వం వహిస్తున్న  క్రైమ్ కామెడీ థ్రిల్లర్ శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్(srikakulam sherlock holmes). వెన్నపూస రమణ రెడ్డి నిర్మిస్తున్నారు. సోమవారం ఈ మూవీ ఫస్ట్ లుక్ లాంచ్ ఈవెంట్‌‌‌‌‌‌‌‌ను నిర్వహించారు. గెస్ట్‌‌‌‌‌‌‌‌గా హాజరైన దిల్ రాజు మాట్లాడుతూ ‘టైటిల్ ఆసక్తికరంగా ఉంది. సినిమాలో సరికొత్త  వైబ్ కనిపిస్తోంది. మంచి వినోదం ఉంటుందని నమ్మకం కలుగుతోంది. టీమ్‌‌‌‌‌‌‌‌కు ఆల్ ద బెస్ట్ ’ అని చెప్పారు.

అనన్య నాగళ్ల మాట్లాడుతూ ‘ఈ సినిమా ఒక పజిల్ లాంటిది. ఏం జరుగుతుందనే  క్యూరియాసిటీ ఉంటుంది’ అని చెప్పింది. దర్శకుడు మోహన్ మాట్లాడుతూ ‘షెర్లాక్ హోమ్స్‌‌‌‌‌‌‌‌లో మూడు పాత్రలు ఉన్నాయి. షెర్ అంటే షర్మిలమ్మ (అమ్మ).. లోక్ అంటే లోకనాధం(నాన్న),  హోం అంటే ఓం ప్రకాష్. రూరల్, 91 రెట్రో బ్యాక్‌‌‌‌‌‌‌‌డ్రాప్‌‌‌‌‌‌‌‌లో ఈ సినిమా చేశాం. ఫన్నీగా థ్రిల్లింగ్​గా ఉంటుంది’ అని చెప్పాడు. నటులు నాగ మహేష్ , భద్రం, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ రాజేష్ రామ్ బాల పాల్గొన్నారు.