సంబరాల ఏటిగట్టులో.. పవర్‌‌‌‌ఫుల్ పాత్రలో శ్రీకాంత్

సంబరాల ఏటిగట్టులో.. పవర్‌‌‌‌ఫుల్ పాత్రలో శ్రీకాంత్

సాయి దుర్గా తేజ్ హీరోగా రోహిత్ కేపీ దర్శకత్వంలో ప్రైమ్ షో ఎంటర్‌‌‌‌టైన్‌‌మెంట్ బ్యానర్‌‌‌‌పై నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి నిర్మిస్తున్న చిత్రం ‘సంబరాల ఏటిగట్టు’.  ఈ  చిత్రంలో సీనియర్ హీరో శ్రీకాంత్ పవర్‌‌‌‌ఫుల్ పాత్రని పోషిస్తున్నారు.  

సోమవారం  శ్రీకాంత్ బర్త్‌‌డే సందర్భంగా  ఫస్ట్‌‌లుక్ పోస్టర్‌‌‌‌ను రిలీజ్ చేశారు. ఇందులో ఆయన   బ్రిటిషర్  పాత్రలో కనిపించనున్నట్టు రివీల్ చేశారు.  ‘ప్రతి గాయాన్ని ఒక పతకంలా ధరించే సైనికుడు’ అంటూ ఆయన క్యారెక్టర్‌‌‌‌ను ఇంట్రడ్యూస్ చేయడం ఆకట్టుకుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. 

 ఐశ్వర్య లక్ష్మి హీరోయిన్‌‌గా నటిస్తుండగా,  జగపతి బాబు, సాయి కుమార్, అనన్య నాగళ్ల ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.  ఇప్పటికే విడుదలైన అసుర ఆగమన గ్లింప్స్‌‌కి మంచి రెస్పాన్స్ వచ్చింది.  బి అజనీష్ లోక్‌‌నాథ్ సంగీతం అందిస్తున్నాడు.