ఆసక్తిగా కోట బొమ్మాళి పీఎస్‌ టీజర్ .. ఆడించేది పొలిటిషనా? పోలీసా?

ఆసక్తిగా  కోట బొమ్మాళి పీఎస్‌ టీజర్ .. ఆడించేది పొలిటిషనా?  పోలీసా?

మలయాళ సినిమాలు ఇటీవల తెలుగులో బాగా మెప్పిస్తున్నాయి. ఈ క్రమంలో అక్కడ సూపర్ సక్సెస్ సాధించిన ‘నయట్టు’ అనే సినిమాను గీతా ఆర్ట్స్ 2 సంస్థ తెలుగులో రీమేక్ చేస్తోంది. హీరో శ్రీకాంత్ (Srikanth), శివాని రాజశేఖర్ ( Shivanirajasekhar), రాహుల్ విజయ్( Rahulvijay)  నటిస్తున్న కోట బొమ్మాళి పీఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (Kotabommali PS) గా ఈ మూవీ తెలుగులో రానుంది. లింగి లింగి లింగిడి అనే ఫోక్ సాంగ్ తో ఈ సినిమా జనాల్లోకి దూసుకెళ్లింది.  

లేటెస్ట్ ఈ సినిమా నుంచి టీజర్ రిలీజ్ చేశారు మేకర్స్. ‘హత్య కేసులో ప్రధాన నిందితులుగా పోలీసులు..పరారిలో కోట బొమ్మాళి పోలీసులు’ అనే క్యాప్షన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో ఈ మూవీ తెరకెక్కడం థ్రిల్లింగ్ కలిగిస్తోంది. అనుకోని పరిస్థితుల్లో ఓ హత్య కేసులో ఇరుక్కున్న పోలీస్ ఆఫీసర్ల చుట్టూ తిరుగుతున్న కథ కావడంతో ఆడియన్స్ లో ఇంటెన్స్ క్రియేట్ చేస్తోంది.

ఈ మూవీలో శ్రీ‌కాంత్ కానిస్టేబుల్ పాత్ర‌లో అద్భుతంగా న‌టించ‌గా..మ‌రో కాప్ పాత్ర‌లో లేడీ సెన్సేషన్ వరలక్ష్మి శరత్‌కుమార్ (Varalaxmisarathkumar)  ప్రామిస్సింగ్ పెర్ఫామెన్స్ తో అదరగొడుతుంది. కోట బొమ్మాళి మూవీ థీమ్ చూసుకుంటే ఇద్దరు రాజకీయ ప్రత్యర్థుల శక్తుల మధ్య ఒక పోలీసు ఎలా ఇరుక్కుపోయాడు. చేయని తప్పుకి నేరం మీదేసుకోవడం ఇష్టం లేక..సాక్షాలు సంపాదించడం కోసం ఎటువంటి ప్రయత్నాలు చేసాడనేది టీజర్ బట్టి అర్ధం అవుతోంది.

ఇందులో మురళీ శర్మ రాజ‌కీయ నాయ‌కుడిగా న‌టిస్తున్నారు. ఒక రాజకీయ నాయకుడు సమాజ వ్యవస్థను ఎలా ఆటాడిస్తాడు? అనేది టీజర్ బట్టి క్లారీటిగా అర్ధం అవుతుంది. ఇక ఈ సినిమాలో పోలీసుల‌పై రాజకీయ నాయ‌కుల ఒత్తిడి ఏ రేంజులో ఉంటుందనేది చూపించారు మేకర్స్. 

‘అర్జున ఫల్గుణ’ ఫేమ్ తేజ మార్ని కోట బొమ్మాళి మూవీని డైరెక్ట్ చేస్తున్నాడు. బన్నీ వాస్, విద్యా కొప్పిని నిర్మిస్తున్నారు. మిధున్ ముకుందన్ సంగీతం అందిస్తున్నాడు. GA 2 బ్యానర్ ఈ చిత్రాన్ని నవంబర్ 24న గ్రాండ్ గా రిలీజ్ చేస్తోంది