యాక్షన్ సినిమాలపై గౌరవం పెరిగింది : శ్రీలీల.

యాక్షన్ సినిమాలపై గౌరవం పెరిగింది  : శ్రీలీల.

బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ఫుల్‌‌ బిజీగా ఉంది హీరోయిన్ శ్రీలీల. రామ్‌‌కు జంటగా ఆమె నటించిన చిత్రం ‘స్కంద’. బోయపాటి శ్రీను దర్శకత్వంలో శ్రీనివాస చిట్టూరి నిర్మించిన ఈ చిత్రం గురువారం విడుదలవుతోంది. ఈ సందర్భంగా హీరోయిన్  శ్రీలీల ఇలా ముచ్చటించింది.  ‘‘ఈ సినిమా నాకొక గుడ్ ఎక్స్‌‌పీరియన్స్. చాలా ఎంజాయ్ చేశాను. సినిమాలో రామ్ గారికి, నాకు మధ్య క్యూట్ కెమిస్ట్రీ ఉంటుంది. మాస్, క్లాస్ రెండూ మిక్స్ అయిన క్యారెక్టర్ నాది. చాలా రూల్స్, నియమాలు పాటించే అమ్మాయిగా కనిపిస్తా.  నా పాత్రకు సరదాగా ఉండే సీన్స్‌‌తో పాటు ఎమోషనల్ సీన్స్ ఉన్నాయి.  సినిమా చాలా గ్రాండ్‌‌గా ఉంటుంది. మాస్ ఎలిమెంట్స్, యాక్షన్‌‌ సీన్స్ అద్భుతంగా చూపించడం బోయపాటి గారి మార్క్ . 

ఈ సినిమా చేశాక యాక్షన్ సినిమాలపై మరింత గౌరవం పెరిగింది. ఈ తరహా సినిమాలో నటించడం, ఇలాంటి పాత్ర పోషించడం నాకు కొత్త. ఆ విషయంలో రామ్ చాలా గైడ్ చేశారు. తనతో వర్క్ చేయడం వండర్ ఫుల్ ఎక్స్ పీరియన్స్. పవర్ ఫుల్ డైలాగ్స్ చెప్పడం నాకు ఇదే మొదటిసారి. బోయపాటి గారు ముందే ట్రైన్ చేశారు. నా పాత్రకు నేనే డబ్బింగ్ చెప్పాను. ఇక ‘ధమాకా’లో నా డ్యాన్స్‌‌కు అంతలా పేరు వస్తుందని ముందు అనుకోలేదు. ఇందులోనూ మాస్, వెస్ట్రన్ డ్యాన్సులు ఆకట్టుకుంటాయి. యాక్షన్‌‌తో పాటు మంచి ఫ్యామిలీ ఎమోషన్స్ ఉన్న సినిమా ఇది. శ్రీనివాస చిట్టూరి గారు ఎక్కడా రాజీపడకుండా గ్రాండ్‌‌గా నిర్మించారు’’.