భాషతోనే ఆ ఎమోషనల్ బాండింగ్ అంటున్న శ్రీలీల

భాషతోనే ఆ ఎమోషనల్ బాండింగ్ అంటున్న శ్రీలీల

సక్సెస్‌‌,  ఫెయిల్యూర్స్‌‌తో సంబంధం లేకుండా వరుస సినిమాలతో దూసుకెళ్తోంది శ్రీలీల. తెలుగుతో పాటు ఇతర భాషల్లోనూ బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తోంది. ప్రస్తుతం హిందీలో కార్తీక్ ఆర్యన్‌‌కు జంటగా ‘ఆషికీ 3’, కోలీవుడ్‌‌లో ధనుష్‌‌కు జంటగా ఓ సినిమా చేస్తోంది. ఇటు సౌత్‌‌, అటు నార్త్ అనే తేడా లేకుండా దూసుకెళ్తున్న శ్రీలీల.. ఇటీవల భాష, సంస్కృతిపై చేసిన కామెంట్స్‌‌ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

 డిఫరెంట్ ఇండస్ట్రీస్​లో​ వర్క్ చేయడం అక్కడి ప్రేక్షకులతో కనెక్ట్ అవడం గురించి ఆమె మాట్లాడుతూ ‘నేను ప్రతి భాషను గౌరవిస్తా. నాలుగైదు భాషల్లో సినిమాలు చేస్తున్నా. ఏ కొత్త ప్రాంతానికి వెళ్లినా అక్కడ వేదికపై ఉన్నంతసేపు స్థానిక భాషలో మాట్లాడటానికి ప్రయత్నిస్తా. ఓ నటిగా అక్కడి ప్రజలకు, వారి భాషకు నేను ఇచ్చే కనీస గౌరవం అది’ అని చెప్పింది.  

అంతేకాదు..  ప్రమోషనల్ ఈవెంట్స్, పబ్లిక్ అప్పియరెన్స్‌‌లలో స్థానిక భాషలో మాట్లాడటం వల్ల ప్రేక్షకులకు, సెలబ్రిటీలకు మధ్య ఒక ఎమోషనల్ బాండింగ్ ఏర్పడుతుందని శ్రీలీల అభిప్రాయపడింది. ఇది ఆయా ప్రాంతాల సంస్కృతిని, అక్కడి ప్రజల ఐడెంటిటీని మనస్ఫూర్తిగా గౌరవించడమేనని స్పష్టం చేసింది.