అసెంబ్లీ ఎన్నికల ఖర్చు వివరాలను సమర్పించాలి : శ్రీయాన్

అసెంబ్లీ ఎన్నికల ఖర్చు వివరాలను సమర్పించాలి : శ్రీయాన్

నిర్మల్, వెలుగు: అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు, ప్రచారంలో భాగంగా చేసిన ఖర్చు వివరాలు సమర్పించాలని రాష్ట్ర ఎన్నికల వ్యయ పరిశీలకుడు శ్రీయాన్ కోరారు. శుక్రవారం నిర్మల్​కలెక్టరేట్ లో పొలిటికల్ పార్టీల ప్రతినిధులతో సమీక్ష నిర్వహించారు. ఖర్చులకు సంబంధించిన బిల్లులను, బ్యాంక్​అకౌంట్ల వివరాలను తప్పనిసరిగా సమర్పించాలని సూచించారు. 

వివరాలు సక్రమంగా సమర్పించని వారికి వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఉండదన్నారు. వారం రోజుల్లో ఈ ప్రక్రియను  పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో అడిషనల్ కలెక్టర్ కిశోర్ కుమార్, ఆర్డీఓలు పాల్గొన్నారు.