కేంద్ర ప్రభుత్వంలోని వివిధ మంత్రిత్వ శాఖలు, విభాగాలు, కార్యాలయాల్లో లోయర్ డివిజన్ క్లర్క్ (ఎల్‌డీసీ), జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ (జేఎస్ఏ), డేటా ఎంట్రీ ఆపరేటర్ (డీఈఓ)/ డీఈఓ గ్రేడ్ ‘ఏ’ పోస్టుల భర్తీ కోసం స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ (ఎస్ఎస్సీ) కంబైండ్ హైయర్ సెకండరీ లెవెల్ (సీహెచ్ఎస్ఎల్) ఎగ్జామినేషన్-–2026 నోటిఫికేషన్ విడుదల చేసింది.
ఈ రిక్రూట్‌మెంట్ ద్వారా దాదాపు 2,536 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టుల భర్తీకి సంబంధించి సెప్టెంబర్ 7 నుంచి ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమైంది. అభ్యర్థులు అక్టోబర్ 7లోపు తమ దరఖాస్తులను సమర్పించవచ్చు. అర్హత, ఆసక్తి గల అభ్యర్థులు నిర్ణీత గడువులోగా దరఖాస్తు చేసుకోవచ్చు.
- మొత్తం ఖాళీలు: 2536.
- పోస్టు పేరు: లోయర్ డివిజన్ క్లర్క్ (ఎల్‌డీసీ)/ సెక్రటేరియట్ అసిస్టెంట్ (జేఎస్ఏ), డేటా ఎంట్రీ ఆపరేటర్ (డీఈఓ)/ డీఈఓ గ్రేడ్ ఏ (కంబైన్డ్).
- విద్యార్హతలు
- డీఈఓ/ డీఈఓ గ్రేడ్ ‘ఎ’ పోస్టులకు గుర్తింపు పొందిన బోర్డు నుంచి సైన్స్ స్ట్రీమ్‌లో గణితం ఒక సబ్జెక్టుగా
- ఇంటర్మీడియట్ లేదా 12వ తరగతి ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
- లోయర్ డివిజన్ క్లర్క్ (ఎల్‌డీసీ), జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ (జేఎస్ఏ), ఇతర విభాగాలకు చెందిన డేటా ఎంట్రీ ఆపరేటర్ (డీఈఓ)/ డీఈఓ గ్రేడ్ ‘ఎ’ పోస్టులకు గుర్తింపు పొందిన బోర్డు నుంచి 12వ తరగతి లేదా ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
- 12వ తరగతి పరీక్షలకు హాజరైన అభ్యర్థులు కూడా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.
- వయసు: 2026, ఆగస్టు 1 నాటికి 18 నుంచి 27 ఏళ్ల మధ్యలో ఉండాలి. అంటే అభ్యర్థులు 1999, ఆగస్టు 2 నుంచి 2008, ఆగస్టు 1 మధ్యలో జన్మించిన వారై ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, పీడబ్ల్యూబీడీలకు పదేళ్లు, ఎక్స్ సర్వీస్‌మెన్ అభ్యర్థులకు ఐదేళ్లు వయోపరిమితిలో సడలింపు వర్తిస్తుంది.
- అప్లికేషన్: ఆన్‌లైన్ ద్వారా.
- అప్లికేషన్ ప్రారంభం: సెప్టెంబర్ 7.
- అప్లికేషన్ ఫీజు: జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ అభ్యర్థులు రూ.100 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ, ఎక్స్ సర్వీస్‌మెన్, మహిళా అభ్యర్థులకు ఫీజు ఉండదు.
- లాస్ట్ డేట్: అక్టోబర్ 7.
- సెలెక్షన్ ప్రాసెస్: టైర్–I, టైర్–II రాత పరీక్ష ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
- మరిన్ని వివరాలకు వెబ్సైట్ ssc.gov.inను సందర్శించండి.
టైర్–I ఎగ్జామినేషన్
ఆన్‌లైన్ పద్ధతిలో నిర్వహించే ఎగ్జామ్‌లో ప్రశ్నలు మల్టిపుల్ చాయిస్ రూపంలో ఇస్తారు. మొత్తం నాలుగు సెక్షన్లు ఉంటాయి. 100 ప్రశ్నలు ఇస్తారు. 200 మార్కులకు ఎగ్జామ్ ఉంటుంది. 60 నిమిషాల్లో పూర్తిచేయలి. పార్ట్-–Iలో ఇంగ్లిష్ లాంగ్వేజ్ (బేసిక్ నాలెడ్జ్) నుంచి 25 ప్రశ్నలు 50 మార్కులకు, జనరల్ ఇంటెలిజెన్స్ నుంచి 25 ప్రశ్నలు 50 మార్కులకు, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ (బేసిక్ అర్థమెటిక్ స్కిల్) నుంచి 25 ప్రశ్నలు 50 మార్కులకు, జనరల్ అవేర్ నెస్ నుంచి 25 ప్రశ్నలు 50 మార్కులకు అడుగుతారు. నెగెటివ్ మార్కింగ్ ఉంది. ప్రతి తప్పు సమాధానానికి 0.50 మార్కులు కోత విధిస్తారు.
టైర్–II ఎగ్జామినేషన్
టైర్–-II పరీక్షను ఒకే రోజులో రెండు వేర్వేరు సెషన్‌ల్లో నిర్వహిస్తారు. ఈ పరీక్షలో మొత్తం నాలుగు విభాగాలు ఉంటాయి.
సెక్షన్-I: మ్యాథమెటికల్ ఎబిలిటీస్, రీజనింగ్ & జనరల్ ఇంటెలిజెన్స్.
సెక్షన్-II: ఇంగ్లిష్ లాంగ్వేజ్ & కాంప్రహెన్షన్, జనరల్ అవేర్‌నెస్.
సెక్షన్-III: కంప్యూటర్ నాలెడ్జ్ టెస్ట్ (ఇది కేవలం అర్హత పరీక్ష మాత్రమే ).
సెక్షన్-IV: స్కిల్ టెస్ట్/ టైపింగ్ టెస్ట్ (డీఈఓ, ఎల్‌డీసీ/ జేఎస్‌ఏ పోస్టుల కోసం).
ఈ పరీక్షలో ఉత్తీర్ణత సాధించాలంటే అభ్యర్థులు అన్ని విభాగాల్లోనూ తప్పనిసరిగా అర్హత సాధించాలి. అలాగే సెక్షన్–-I, సెక్షన్–-IIలకు నెగెటివ్ మార్కింగ్ ఉంది. ప్రతి తప్పునకు 1 మార్కు చొప్పున కోత ఉంటుంది.
