హైదరాబాద్, వెలుగు: స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ 20 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో మెగా హెల్త్ క్యాంపులను నిర్వహిస్తోంది. ఆరోగ్య సంరక్షణపై అవగాహన పెంచడం, ముందస్తు వ్యాధి గుర్తింపు లక్ష్యంగా ఈ కార్యక్రమం సాగుతోంది. హైదరాబాద్, వరంగల్, కరీంనగర్, నిజామాబాద్, ఖమ్మం వ్యాప్తంగా శిబిరాలు జరుపుతున్నాయి. బిఎమ్‌ఐ, షుగర్, బీపీ, ఈసీజీ, లిపిడ్ ప్రొఫైల్, కంటి, దంత పరీక్షలు ఉచితంగా అందిస్తున్నారు. మెడికవర్, మ్యాక్స్ విజన్, క్లోవ్ డెంటల్ తదితర ఆస్పత్రుల భాగస్వామ్యంతో వీటిని నిర్వహిస్తున్నామని కంపెనీ తెలిపింది.
