ఖైరతాబాద్, వెలుగు: తెలంగాణ, ఏపీలో ఇంజనీరింగ్ పూర్తిచేసిన 18 మంది యువకులు కలిసి నూతన ఆవిష్కరణలకు శ్రీకారం చుట్టారు. వేర్వేరు ఇంజనీరింగ్‌కాలేజీల్లో చదువుకున్న వీరంతా ఏకమై ‘ఎధోద్వజ ప్రైవేట్ లిమిటెడ్’ పేరుతో స్టార్టప్కంపెనీని స్టార్ట్చేశారు. నూతన టెక్నాలజీని ఉపయోగించుకుంటూ సరికొత్త ఆవిష్కరణలు చేసేందుకు ఓ బస్సును ఎంపిక చేసుకున్నారు. దానికి ఫ్యూచరిస్టిక్ ల్యాబ్ ఆన్‌వీల్స్(ఫ్లో) అని పేరుపెట్టారు. అందులో సోలార్ పవర్ద్వారా కట్టింగ్ఎడ్జ్, డ్రోన్, ఏఐ, మెకానిక్లెర్నింగ్టెక్నాలజీలను వినియోగించుకుంటూ రోబోటిక్స్, 3 డీ ప్రింటింగ్, హోలోగ్రామ్స్ పై ఆవిష్కరణలు చేస్తున్నారు.
ఫ్యూచరిస్టిక్ ల్యాబ్ ఆన్‌వీల్స్ ను ఈ నెల10వ తేదీన సీఎం రేవంత్‌రెడ్డి ప్రారంభించారు. ఫ్లోను రూపొందించిన యువ ఇంజనీర్లు గురవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్ లో సమావేశం నిర్వహించి, వారి ఆవిష్కరణలను మీడియాకు చూపించారు. సంస్థ సీఈఓ మధులాష్‌బాబు, సీటీఓ పవన్ కుమార్, మౌనిక మాట్లాడుతూ.. తాము రూపొందించిన ఆవిష్కరణలను త్వరలో రాష్ట్రంలోని అన్ని స్కూళ్లు, ఇంజనీరింగ్‌కాలేజీల్లో ప్రదర్శనకు ఉంచుతామని, స్టూడెంట్లకు అవగాహన కల్పిస్తామని చెప్పారు. ఫ్లో రూపకల్పనకు అమెరికాకు చెందిన జార్జి మాసన్ యూనివర్సిటీ రూ.80 లక్షలు, తిరుపతిలోని పద్మావతి మహిళా యూనివర్సిటీ రూ.25 లక్షలు సాయం చేశాయని తెలిపారు.