స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) ఇంటర్నేషనల్ బ్యాంకింగ్ గ్రూప్ (ఐబీజీ) విభాగంలో ట్రేడ్ ఫైనాన్స్ ఆఫీసర్ - ఐబీజీ (టీఎఫ్ఓ– ఐబీజీ) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా స్పెషలిస్ట్ కేడర్ కింద మొత్తం 35 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఆసక్తి గల అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్‌లో అప్లయ్ చేసుకోవచ్చు.
పోస్టు పేరు: ట్రేడ్ ఫైనాన్స్ ఆఫీసర్ జేఎంజీఎస్–-I & ఎంఎంజీఎస్–-II.
మొత్తం ఖాళీలు: 35.
విభాగాల వారీగా ఖాళీలు: ట్రేడ్ ఫైనాన్స్ ఆఫీసర్ – ఐబీజీ (టీఎఫ్ఓ – ఐబీజీ) జేఎంజీఎస్–-I – 14, ట్రేడ్ ఫైనాన్స్ ఆఫీసర్ - ఐబీజీ (టీఎఫ్ఓ –- ఐబీజీ) ఎంఎంజీఎస్-–-I- 21.
ఎలిజిబిలిటీ: గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా సంస్థ నుంచి ఏదైనా గ్రాడ్యుయేషన్ పూర్తిచేసి ఉండాలి.
ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ (ఐఐబీఎఫ్) నుంచి ఫారెక్స్ ఆపరేషన్స్‌లో సర్టిఫికెషన్ కలిగి ఉండాలి.
ఎల్ఐబీఎఫ్ జారీ చేసిన సర్టిఫికెట్ ఫర్ డాక్యుమెంటరీ క్రెడిట్ స్పెషలిస్ట్స్ (సీడీసీఎస్) లేదా సర్టిఫికెట్ ఫర్
స్పెషలిస్ట్స్ ఇన్ డిమాండ్ గ్యారంటీస్ (సీఎస్డీజీ) లేదా ఐసీసీ అకాడమీ అందించే సర్టిఫైడ్ ట్రేడ్ ఫైనాన్స్
ప్రొఫెషనల్ (సీటీఎఫ్పీ) కలిగి ఉన్నవారికి ప్రాధాన్యత ఉంటుంది. ఉద్యోగ అనుభవం తప్పనిసరి.
వయోపరిమితి: టీఎఫ్ఓ – ఐబీజీ, జేఎంజీఎస్–-I పోస్టులకు 21 నుంచి 30 ఏళ్ల మధ్యలో ఉండాలి.
టీఎఫ్ఓ–- ఐబీజీ, ఎంఎంజీఎస్--I పోస్టులకు 23 నుంచి 32 ఏళ్ల మధ్యలో ఉండాలి.
అప్లికేషన్: ఆన్లైన్ ద్వారా.
అప్లికేషన్ ప్రారంభం: ఆగస్టు 29.
అప్లికేషన్ ఫీజు: జనరల్/ ఈడబ్ల్యూఎస్/ ఓబీసీలు రూ. 750 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీలకు ఫీజు ఉండదు.
లాస్ట్ డేట్: సెప్టెంబర్ 19.
సెలెక్షన్ ప్రాసెస్: షార్ట్‌లిస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
మరిన్ని వివరాలకు వెబ్సైట్ sbi.bank.inను సందర్శించండి.
