ఆకాశంలో మరో అద్భుత దృశ్యం జూన్ 29న ఆవిష్కృతం కానుంది. ఎప్పుడూ దగ దగ మెరుస్తూ తెల్లగా కనిపించే చంద్రుడు.. ఆరోజు కొత్త రంగును సంతరించుకోనున్నాడు. చంద్రుడిని సాధారణంగా ఎరుపు, పసుపు, నలుపు చూసి ఉంటాం. ఆ రోజు రాత్రి చంద్రుడు స్ట్రా బెర్రీ మూన్.. లేత బంగారు, నారింజ లేదా తేనె రంగులో కను విందు చేయనున్నాడు. ఇందుకు గల కారణాల గురించి ఈ స్టోరీలో తెలుసుకుందాం...
పురాణాల ప్రకారం పూర్ణిమ తిథికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఆ రోజున భూమిపై చంద్రుని ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ప్రతి ఏడాది జూన్ నెలలో పౌర్ణమి రోజున స్ట్రా బెర్రీ మూన్ ఆకాశంలో విహరించనున్నాడు.
జూన్ నెల పౌర్ణమి 29 వ తేది రాత్రి.. 30 వ తేదీ తెల్లవారు జామున చంద్రుడు న లేత బంగారు, నారింజ లేదా తేనె రంగులో చంద్రుడు కనపడతాడు. ఖగోళ శాస్త్రవేత్తలు తెలిపిన వివరాల ప్రకారం ఆరోజున చంద్రుడు ఆకాశంలో చాలా తక్కువ ఎత్తులో ప్రయాణిస్తాడు. చంద్రుని కాంతి భూ వాతవరణం ద్వారా ఎక్కువ దూరం ప్రయాణం చేయడం వలన చంద్రుడిపై పడిన కాంతి ప్రభావం వలన కలర్ ఛేంజ్ అవుతుంది, మరో విషయాన్ని గమనిస్తే జూన్ నెల పౌర్ణమి రోజున చంద్రుడు క్షితిజానికి దగ్గరగా ఉన్నప్పుడు చాలా పెద్దగా కనపడతాడు. దీన్నే ఖగోళ భాషలో మూఐన్ ఇల్యూషన్ అంటారు.
స్ట్రాబెర్రీ మూన్ అంటే ఏమిటి?
చాలామందికి స్ట్రా బెర్రీ పండు గురించి తెలుసు. జూన్ నెల పౌర్ణమి రోజు ఉత్తర అమెరికాలోని అల్లంక్విన్ తెగ వారు అడవిలో స్ట్రా బెర్రీ పండ్లను కోయడం ప్రారంభిస్తారు. అందుకే ఈ పౌర్ణమిని స్ట్రాబెర్రీ మూన్ అని పిలుస్తారు. అంతే కాని చంద్రుడు స్ట్రా బెర్రీ కలర్ లో కనపడడని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
స్ట్రా బెర్రీ మూన్ ను ఎప్పుడు చూడాలి..
జూన్ నెల పౌర్ణమి ఈ నెల 29 వ తేదీ వచ్చింది. అంటే 29 వ తేది రాత్రి.. 30 వ తేదీ తెల్లవారుజామున చూడాలి. ఖగోళ శాస్త్రవేత్తల అభిప్రాయం ప్రకారం చంద్రోదయం అయిన వెంటనే ఈ చంద్రుడు మరింత అందంగా కనిపిస్తాడు
- పౌర్ణమి గరిష్ఠ దశ: జూన్ 29 రాత్రి 11:57 గంటలకు ప్రారంభం
- పూర్తి ప్రకాశానికి సమీప సమయం: జూన్ 30 ఉదయం 5:27 గంటల వరకు
స్ట్రా బెర్రీ మూన్ ను ఎలాంటి టెలిస్కోపిక్ పరికరాలు లేకుండానే స్పష్టంగా చూడవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. సహజంగా ఆ రోజు వెలుతురు ఉంటుంది. బాగా లైటింగ్ ఉండే ప్రదేశంలో కాలుష్యం తక్కువుగా ఉండే చోటు నుంచి నేరుగా చూడవచ్చు. ఫోటోలు తీసుకోవాలనుకొనే వారు 29 వ తేది అర్దరాత్రి 12.03 నుంచి తెల్లవారుజామున 1.05 గంటల మధ్య తీస్తే చాలా స్పష్టంగా వస్తాయి.ప్రపంచవ్యాప్తంగా ఖగోళ ప్రేమికులు ఈ అద్భుతమైన పౌర్ణమిని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు
