ఇది సూపర్ డాగ్ : కుక్కకు అభినందనల వెల్లువ.. ఎందుకంటే

ఇది సూపర్ డాగ్ :  కుక్కకు అభినందనల వెల్లువ.. ఎందుకంటే

ఎవరికైనా ఏదైనా కాస్తంతా ఉపకారం చేస్తే మనుషులు గుర్తు పెట్టుకోరు గాని... కుక్కలకు జర సాయం చేస్తే చాలు... జీవితాంతం వారిని కంటికి రెప్పలా కాపాడుతూనే ఉంటుంది ఆ కుక్క.  అందుకే కుక్క విశ్వాసానికి మారుపేరు అని చెబుతుంటారు.  తాజాగా ఓ వీధి కుక్క బాలికను కాపాడిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది.  తాజాగా ఓ వీధి కుక్క స్కూల్ నుంచి వస్తున్న బాలికను కిడ్నాపర్ల బారి నుంచి కాపాడింది.అయితే ఈ ఘటన ఎక్కడ జరిగిందో తెలియదు కాని ఆగస్టు 26న  సీసీటీవీ ఈడియట్స్ అనే ట్విట్టర్ యూజర్ లో వీడియో  పోస్టు చేసిర కొద్ది క్షణాల్లో  నెట్టింట వైరల్ అవుతుంది.

 ఈ వీడియోలో రెడ్ కలర్ కోటు వేసుకున్న ఓ బాలిక రోడ్డుపై ఒంటరిగా వస్తుంది. ఆ అమ్మాయిని  ఓ కారు ఫాలో అవుతున్నట్లు స్పష్టంగా ఉంది.  దగ్గరకు రాగానే కారు డోర్ తీసి అమ్మాయిని కిడ్నాప్ చేయబోయారు.  ఇక అంతే ఆ అమ్మాయి కంగారుగా  రెండగులు వెనక్కు వేసింది.  ఇంతలో అనూహ్యంగా ఓ  వీధికుక్క వేగంగా వచ్చి కారులో ని వారిపై అరుస్తుంది.  దీంతో భయపడిన కిడ్నాపర్లు అక్కడి నుంచి పారిపోయారు. ఆ బాలిక పరిగెత్తుకుంటూ అక్కడి నుంచి వెళ్లిపోయింది. కుక్కకు తెలియకుండానే తన వీధిలోకి కొత్త వ్యక్తులు రావడంతో వారిపై దాడి చేయడానికి ప్రయత్నించింది. దాంతో వారు ఆ బాలికను వదిలేసి వెళ్లిపోయారు. తెలిసి చేసినా, తెలియక చేసినా కుక్క వల్ల బాలికకు మంచి జరిగింది.

ఈ మొత్తం ఘటన అక్కడ ఉన్న సీసీ టీవీ కెమెరాలో రికార్డ్ అయ్యింది. ఈ కుక్క ఒక పెద్ద బోన్ (మాంసం)  కొనియ్యాలి అని క్యాప్షన్ జోడించి దీనిని సీసీటీవీ ఇడియట్స్ అనే యూజర్ ఎక్స్ (ట్వీటర్) ఖాతాలో పోస్ట్ చేయడంతో ఇది వైరల్ గా మారింది. ఈ వీడియోను ఇప్పటికే రెండు కోట్ల మందికి పైగా వీక్షించారు. లక్షకు పైగా లైక్ లు వచ్చాయి. ఈ వీడియో చూసిన వారు పెంపుడు కుక్కల వల్లే కాదు వీధి కుక్కల వల్ల కూడా చాలా ఉపయోగాలు ఉన్నాయని పేర్కొన్నారు. సూపర్ డాగ్ అంటూ మరికొంతమంది కొనియాడుతున్నారు.  ఆ బాలిక ఎవరో తెలియకపోయినా ఆమెను కుక్క కాపాడిందంటూ నెటిజన్లు ఆ కుక్కకు సోషల్ మీడియాలో నెటిజన్లు అభినందనలతో  ముంచెత్తుతున్నారు.