ట్రాఫిక్ అంటూ చిరాకు పడొద్దు.. చక్కగా ప్రేమించుకోండి.. టైం ఉంది కదా..

ట్రాఫిక్ అంటూ చిరాకు పడొద్దు.. చక్కగా ప్రేమించుకోండి.. టైం ఉంది కదా..

బెంగుళూరు తన ట్రాఫిక్‌తో మరోసారి వార్తల్లో నిలిచింది. నగరంలో ట్రాఫిక్ ఎంత అధ్వాన్నంగా ఉంటుందో కొంత కాలం నుంచి పలు వార్తలు హల్చల్ చేస్తూనే ఉన్నాయి. ఇటీవలి కాలంలో అక్కడి వారికీ ఇది అత్యంత చిరాకు తెప్పించే విషయంగానూ ప్రసిద్ధి చెందింది. అయితే, ఈ ట్రాఫిక్ రొటీన్‌ను సరదాగా ప్రయాణం చేయడానికి చాలా మార్గాలు ఉన్నాయి. కొంతమంది ఈ టైంలో సంగీతం వినడానికి ఇష్టపడతారు. మరికొందరు నిద్ర పోతుంటారు. అయితే ట్రాఫిక్ లో చిక్కుకున్నపుడు తమ డైటింగ్ నైపుణ్యాలను ఎలా పెంచుకోవచ్చో ఓ ఎక్స్ యూజర్ రీసెంట్ గా బయటపెట్టారు.

ప్రకృతి అనే యూజర్ బెంగళూరు ప్రజలు ప్రయత్నించగలిగే డేటింగ్ చిట్కాను పంచుకున్నారు. "బెంగళూరు డేటింగ్ చిట్కా: ట్రాఫిక్ రద్దీ ఎక్కువగా ఉన్న సమయంలో మీరు ముందుగా కలుసుకుని, మీకు ఇష్టమైన ప్రదేశానికి కలిసి ప్రయాణించడానికి ప్రయత్నించండి. ఇలా చేస్తే మీరు ఎక్కువ సమయం కలిసి గడపగలుగుతారు. వారికి ఏవైనా కోపం సమస్యలు ఉన్నాయా అని కూడా మీరు తెలుసుకోవడానికి మంచి సమయం అని ఆమె రాసుకువచ్చింది.
 
చాలా మంది నెటిజన్లు ఈ ఆలోచనను సపోర్ట్ చేస్తూ ట్వీట్‌కి రిప్లై ఇచ్చారు. "మీ అనుభవాన్ని మెరుగుపరచడానికి, క్యాండిల్‌లైట్ డిన్నర్ లాగా, వారు ఒక అవకాశాన్నికూడా జోడించారు అని కొందరు కామెంట్ చేస్తున్నారు. "మీరు ఇంటి నుంచి ప్రారంభమైనపుడు డేటింగ్ ప్రారంభించండి. మీరు సిల్క్‌బోర్డ్‌కు చేరుకునే సమయానికి నిశ్చితార్థం చేసుకోండి, మీరు టిన్ ఫ్యాక్టరీని దాటే సమయానికి మీరు మొదటి బిడ్డను ఆశించవచ్చు" అని మరొకరు రాశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.