కన్నడ రాకింగ్ స్టార్ యశ్‌కు నటించిన 'టాక్సిక్' (Toxic) చుట్టూ ఇప్పుడు సినీ వర్గాల్లో తీవ్ర చర్చ నడుస్తోంది. భారీ అంచనాల నడుమ ఆగస్టు 26న విడుదలైన ఈ చిత్రం తొలి రోజు కలెక్షన్ల వర్షం కురిపించింది. అయితే ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందనతో బాక్సాఫీస్ వద్ద డీలా పడింది. మరో వైపు మేకింగ్ విషయంలో విమర్శకుల నుంచి భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేస్తున్నారు.
యశ్ కు సపోర్టుగా సుమలత..
అయితే, ఈ క్లిష్ట సమయంలోయశ్కు సపోర్ట్‌గా కన్నడ సినీ ప్రముఖులు గట్టిగా నిలబడ్డారు. లేటెస్ట్ గా సీనియర్ నటి, మాజీ ఎంపీ సుమలత అమర్నాథ్ సోషల్ మీడియాలో పెట్టిన సుదీర్ఘమైన, భావోద్వేగపూరిత పోస్ట్ ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది. 'యశ్.. నువ్వు ఎప్పుడూ ధైర్యంగా నీ సొంత దారిలోనే ప్రయాణిస్తావని నాకు తెలుసు. 'టాక్సిక్' సినిమాలో నీ నటన మైండ్ బ్లోయింగ్. బహుశా ఈ సినిమా ఈ కాలానికి చెందింది కాదేమో.. కాలానికంటే చాలా ముందే వచ్చిందేమో! నీ ఎదుగుదలను చూసి ఓర్వలేని కొందరు, సినిమాను సరిగ్గా అర్థం చేసుకోలేనివారు ట్రోల్స్ చేస్తున్నారు. విజయం ఎప్పుడూ కొంతమందిలో అసూయను పెంచుతుంది. దర్శకురాలు గీతూ మోహన్‌దాస్, నువ్వు పడిన కష్టానికి నా జోహార్లు. నీ నుంచి కేజీఎఫ్ ను మించిన విజయం త్వరలోనే వస్తుంది' అంటూ కొనియాడారు.
ALSO READ : రవితేజ వారసుడు మాధవ్ 'మారెమ్మ' ట్రైలర్ రిలీజ్..
రిషబ్ శెట్టి ప్రశంసలు..
మరోవైపు కాంతార స్టార్ రిషబ్ శెట్టి సైతం యశ్‌కు అండగా నిలిచారు. 'టాక్సిక్' ఒక ధైర్యవంతమైన, సాహసోపేతమైన ప్రయోగమని, కన్నడ సినిమాను గ్లోబల్ లెవెల్‌కు తీసుకెళ్లాలనే యశ్ తపన అభినందనీయమని ఆయన పేర్కొన్నారు. ఈ మూవీలో యశ్ నటనపై పలువురు ప్రముఖులు ప్రశంసలు కురిపిస్తున్నారు. నయనతార, కియారా అద్వానీ, హుమా ఖురేషి, రుక్మిణి వసంత్, తారా సుతారియా వంటి భారీ తారగణంతో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.
రూ.. 300 క్లబ్ లో చేరేనా?
ఇప్పటి వరకు 'టాక్సిక్' ప్రపంచవ్యాప్తంగా రూ. 238.75 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించింది. ఇందులో ఒక్క హిందీ మార్కెట్ నుంచే రూ. 136.25 కోట్లు రావడం విశేషం. అయితే, నెగెటివ్ టాక్ ప్రభావం వల్ల రాబోయే రోజుల్లో , సెకండ్ వీకెండ్లో భారీగా పుంజుకుంటే తప్ప రూ. 300 కోట్ల క్లబ్లో చేరడం ఈ సినిమాకు అతిపెద్ద సవాలుగా మారనుంది. ఏది ఏమైనా, విమర్శలను పక్కన పెడితే యశ్ నటనకు మాత్రం దేశవ్యాప్తంగా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. మేకింగ్, కథ విషయంలో మాత్రం భిన్నవాదనలు వ్యక్తం అవుతున్నాయి.
