రిలీజై రెండు రోజులే అయ్యింది.. అప్పుడే OTTలోకి వచ్చేస్తోంది.

రిలీజై రెండు రోజులే అయ్యింది.. అప్పుడే OTTలోకి వచ్చేస్తోంది.

టాలీవుడ్ టాలెంటెడ్ హీరో సుధీర్ బాబు(Sudheer babu) హీరోగా వచ్చిన లేటెస్ట్ మూవీ మామా మశ్చింద్ర(Maama Mascheendra). నటుడు, రచయిత హర్షవర్ధన్(Harshavardan) దర్శకత్వం వహించిన ఈ మూవీ అక్టోబర్ 6న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సుధీర్ బాబు మూడు డిఫరెంట్ గెటప్స్ లో కనిపించిన ఈ సినిమాపై ముందు నుంచే మంచి అంచనాలు ఏర్పడ్డాయి. అయితే విడుదల తరువాత ఆ అంచనాలను నిలబెట్టుకోలేకపోయింది ఈ సినిమా. 

కథా, కథనాల్లో కొత్తదనం లేకపోవడం, లెక్కకుమించిన ట్విస్టులతో సినిమా గందరగోళంగా మారడంతో ఆడియన్స్ ఈ సినిమాను తిరస్కరించారు. మూడు గేటప్స్ కోసం సుధీర్ బాబు చాలా కష్టపడినా.. ఆయన కష్టానికి తగిన ఫలితం దక్కలేదు అనే చెప్పాలి. దీంతో సుధీర్ బాబు కథలో మరో ప్లాప్ సినిమా పడింది. దీంతో ఈ సినిమా ఓటీటీలో రిలీజ్ చేసేందుకు సిద్ధమయ్యారు. సినిమా రిలీజై కేవలం రెండు రోజులు మాత్రమే అయ్యింది.. ఇంతలోనే ఓటీటీ రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేశారు మేకర్స్. ఇక ఈ సినిమా డిజిటల్ హక్కులను అమెజాన్ ప్రైమ్ సొంతం చేసుకున్న విషయం తెల్సిందే.దసరా కానుకగా అక్టోబర్ 20 నుండి ఈ సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. మరి థియేటర్స్ లో నిరాశపరిచిన ఈ సినిమా.. ఓటీటీలో ఎలాంటి రిజల్ట్ అందుకోనుందో చూడాలి.