సుడిగాలి సుధీర్ హీరోగా రూపొందిన చిత్రం ‘గోట్’. దివ్యభారతి హీరోయిన్. వేదవ్యాస్ దర్శకుడు. మొగుళ్ళ చంద్రశేఖర్ నిర్మించారు. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. బుధవారం మూవీ రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేశారు. మార్చి 26న సినిమాను విడుదల చేయబోతున్నట్టు ప్రకటించారు. ఇప్పటికే విడుదల చేసిన ప్రమోషనల్ కంటెంట్‌కు మంచి రెస్పాన్స్ వచ్చిందని, త్వరలోనే ట్రైలర్‌ను విడుదల చేయబోతున్నట్టు చెప్పారు.
ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ.. ‘పూర్తి స్థాయి కమర్షియల్ ఎలిమెంట్స్‌తో తెరకెక్కించిన ఈ చిత్రంలో నేటి యువతను ఆలోచింపజేసే ఓ మంచి విషయం ఉంది. సుధీర్ కెరీర్‌లో ఈ చిత్రం మైల్‌స్టోన్‌గా నిలుస్తుంది’ అని చెప్పారు. సర్వధమన్ బెనర్జీ, నితిన్ ప్రసన్న, బ్రహ్యాజీ, పృథ్వీ, ఆడుకాలం నరేష్, రాజేంద్రన్, పమ్మి సాయి ఇతర పాత్రలు పోషించారు.
