Sudheer Sarkaar S4: సుధీర్ న్యూ సర్కార్..ఆడే ఆట అదిరిపోవాలి అంతే

Sudheer Sarkaar S4: సుధీర్ న్యూ సర్కార్..ఆడే ఆట అదిరిపోవాలి అంతే

సుడీగాలి సుధీర్ బుల్లితెరపై అతని ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.జబర్దస్త్ షోల్ కమోడియన్ గా.. టీవీ షోల్లో యాంకర్గా ..అప్పుడప్పుడు సినిమాల్లో నటిస్తున్నాడు. చిన్నా చితక మెజిషియన్ చేసుకుంటూ జబర్దస్త్ షో ద్వారా బుల్లితెరపై ఎంట్రీ ఇచ్చి  ఇమేజ్ పెంచుకున్నాడు.ప్రస్తుతానికి పలు షోలతో బిజీగా గడుపుతున్నాడు సుధీర్..వీలైనప్పుడు సినిమాలు కూడా చేస్తున్నాడు. 

ఇదిలా ఉంటే..ప్రముఖ తెలుగు ప్లాట్ఫామ్ ఆహా ఓటీటీలో సక్సెస్ ఫుల్గా మూడు సీజన్స్ పూర్తి చేసుకున్న సర్కార్ షో కి..సుధీర్ యాంకరింగ్ చేయబోతున్నాడు.లేటెస్ట్గా ఈ విషయాన్ని ఆహా  ప్రకటిస్తూ.."కొత్త సర్కార్, సుడిగాలి లాంటి ఎంటర్టైన్మెంట్తో వస్తున్నాడు! ఇక ఆట మొదలెడదామా"అంటూ హైప్ ఇచ్చే అనౌన్స్మెంట్ చేసింది. 

ఇదివరకు సర్కార్ షోకు యాంకర్ ప్రదీప్ మాచిరాజు హోస్ట్గా వ్యవహరించాడు.కాకపోతే ఈ సీజన్కు మాత్రం సుడిగాలి ‘సుధీర్ ఎంటర్టైన్ చేయబోతున్నాడు.ఇక అతి త్వరలోనే ఈ కొత్త సీజన్ స్ట్రీమింగ్ వివరాలు తెలిపే అవకాశం ఉంది. తనదైన మాటలతో అటు ఆడియన్స్ ని..వచ్చే గెస్ట్స్ ని సైతం నవ్వులు పూయించే సుధీర్ ఆటపై అంచనాలు పెరిగిపోయాయి.  

ఈ సర్కార్ షో 2021లో మొదలైంది.కాగా గత సీజన్లో లేడీ సూపర్ స్టార్ సాయి పల్లవి,సిద్దు జొన్నలగడ్డ,రానా,విశ్వక్ సేన్,శ్రీ విష్ణు,ప్రియమణి, సైనా నెహ్వాల్, కశ్యప్ లాంటి ప్రముఖ సెలబ్రిటీలు ఈ షో కి వచ్చి అదరగొట్టారు.మరి రాబోయే ఈ నాలుగో సీజన్ లో భాగంగా వచ్చే స్టార్స్ ఎవరనేది మాత్రం ఆహా ఇంకా క్లారిటీ రాలేదు. త్వరలో తెలిపే అవకాశం ఉంది.సుధీర్ న్యూ సర్కార్ ఆడే ఆట అదిరిపోవాలి.