అందరిలా కాదు.. కాస్త స్పెషల్‌‌‌‌‌‌‌‌.. టిక్ టాక్ వీడియోలు..సుఫియా ఖాన్ కు సోషల్ మీడియా ఇంట్రస్ట్

అందరిలా కాదు.. కాస్త స్పెషల్‌‌‌‌‌‌‌‌.. టిక్ టాక్ వీడియోలు..సుఫియా ఖాన్ కు సోషల్ మీడియా ఇంట్రస్ట్

చదువుకునే రోజుల్లో సోషల్‌‌‌‌‌‌‌‌ మీడియా మీద ఇంట్రెస్ట్‌‌‌‌‌‌‌‌ పెరిగింది. దాంతో టిక్‌‌‌‌‌‌‌‌టాక్‌‌‌‌‌‌‌‌లో వీడియోలు చేయడం మొదలుపెట్టాడు. అందులో సక్సెస్‌‌‌‌‌‌‌‌ రావడంతో ఇక అదే తన లైఫ్ అని డిసైడ్‌‌‌‌‌‌‌‌ అయ్యాడు సుఫియాన్ ఖాన్. టిక్‌‌‌‌‌‌‌‌టాక్‌‌‌‌‌‌‌‌ నుంచి ఇన్‌‌‌‌‌‌‌‌స్టాగ్రామ్‌‌‌‌‌‌‌‌, యూట్యూబ్‌‌‌‌‌‌‌‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. కామెడీ, ఫ్యామిలీ లవ్, ప్రాంక్స్, డైలీ లైఫ్ వ్లాగ్స్‌‌‌‌‌‌‌‌తో లక్షలమంది హార్ట్స్ గెలుచుకున్నాడు. ఇప్పుడు దేశంలోనే టాప్ ఫ్యామిలీ ఎంటర్‌‌‌‌‌‌‌‌టైనర్లలో ఒకరిగా నిలిచారు.

సుఫియాన్ ఖాన్ 1997లో ఒక మిడిల్‌‌‌‌‌‌‌‌ క్లాస్‌‌‌‌‌‌‌‌ ఫ్యామిలీలో పుట్టాడు. ప్రస్తుతం ఫ్యామిలీతో ముంబైలో సెటిల్‌‌‌‌‌‌‌‌ అయ్యాడు. అతను చదువుకునే రోజుల్లో ఇండియాలో టిక్‌‌‌‌‌‌‌‌టాక్‌‌‌‌‌‌‌‌ వాడకం బాగా పెరిగింది. అప్పట్లో అందరూ డబ్‌స్మాష్​ వీడియోలు చేసేవాళ్లు. దాంతో సుఫియాన్‌‌‌‌‌‌‌‌కు కూడా 2016లో టిక్‌‌‌‌‌‌‌‌టాక్ అకౌంట్ క్రియేట్‌‌‌‌‌‌‌‌ చేసుకున్నాడు. అప్పటినుంచి రెగ్యులర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా డబ్‌స్మాష్​, ఫ్యామిలీ కామెడీ వీడియోలు చేస్తూ అప్‌‌‌‌‌‌‌‌లోడ్‌‌‌‌‌‌‌‌ చేశాడు. వాళ్ల ఫ్యామిలీ కూడా అతనికి అడ్డు చెప్పలేదు. 

కరోనాలో అతని వీడియోలకు మరింత ఆదరణ పెరిగింది. ఫాలోవర్ల సంఖ్య 3.2 మిలియన్లకు చేరింది. అప్పుడే ‘సోషల్‌‌‌‌‌‌‌‌ మీడియాలో నేను అందరిలా కాదు కాస్త స్పెషల్‌‌‌‌‌‌‌‌’ అనే కాన్ఫిడెన్స్ వచ్చింది. దాంతో ఉద్యోగ ప్రయత్నాలు మానేసి ఫుల్‌‌‌‌‌‌‌‌టైం ఇన్‌‌‌‌‌‌‌‌ఫ్లుయెన్సర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా మారిపోవాలని నిర్ణయించుకున్నాడు. అప్పటినుంచి ఫిట్‌‌‌‌‌‌‌‌నెస్ కంటెంట్ కూడా షేర్ చేయడం మొదలుపెట్టాడు. 

అయితే.. అదే టైంలో మన దేశంలో టిక్‌‌‌‌‌‌‌‌టాక్ బ్యాన్ అయ్యింది. దాంతో చేసేదేమీ లేక తన జర్నీని మళ్లీ ఇన్‌‌‌‌‌‌‌‌స్టాగ్రామ్‌‌‌‌‌‌‌‌లో స్టార్ట్‌‌‌‌‌‌‌‌ చేశాడు. చిన్న చిన్న రీల్స్‌‌‌‌‌‌‌‌లో ఎంట్రీ ఇచ్చాడు. మరో ఇన్‌‌‌‌‌‌‌‌ఫ్లుయెన్సర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నిదా ఖాన్​తో కలిసి కపుల్ రీల్స్, ప్రాంక్స్ చేసి భారీ ఫాలోయింగ్ సంపాదించుకోగలిగాడు.

 అప్పుడే 2020 జూన్‌‌‌‌‌‌‌‌లో యూట్యూబ్‌‌‌‌‌‌‌‌ చానెల్‌‌‌‌‌‌‌‌ కూడా పెట్టాడు. దానికి ‘సుఫియాన్‌‌‌‌‌‌‌‌ అండ్‌‌‌‌‌‌‌‌ నిదా’ అని పేరుపెట్టాడు. తర్వాత కొన్నాళ్లకు దాని పేరుని ‘సుఫియాన్‌‌‌‌‌‌‌‌ ఖాన్‌‌‌‌‌‌‌‌ వ్లాగ్స్‌‌‌‌‌‌‌‌’గా మార్చాడు. మొదట్లో అందులో డైలీ లైఫ్, హ్యూమర్, ట్రావెల్ అడ్వెంచర్స్‌‌‌‌‌‌‌‌తో సింపుల్ వ్లాగ్స్‌‌‌‌‌‌‌‌ చేసేవాడు. వాటిలో ఫ్యామిలీ బాండింగ్, ప్రాంక్స్ ఆడియన్స్‌‌‌‌‌‌‌‌ను బాగా ఆకట్టుకున్నాయి. 

స్ట్రగుల్ నుంచి సక్సెస్ 

సుఫియాన్ యూట్యూబ్‌‌‌‌‌‌‌‌ జర్నీ సాఫీగా సాగలేదు. మొదట్లో ఎన్నో అడ్డంకులు ఎదుర్కోవాల్సి వచ్చింది. టిక్‌‌‌‌‌‌‌‌టాక్ నుంచి యూట్యూబ్‌‌‌‌‌‌‌‌కి వచ్చిన కొత్తలో పెద్దగా వ్యూస్‌‌‌‌‌‌‌‌ రాలేదు. టిక్‌‌‌‌‌‌‌‌టాక్‌‌‌‌‌‌‌‌లో ఉన్న తన ఫాలోవర్స్‌‌‌‌‌‌‌‌ని యూట్యూబ్‌‌‌‌‌‌‌‌కి మళ్లించలేకపోయాడు. ఒకవైపు కంటెంట్ క్రియేషన్‌‌‌‌‌‌‌‌ మరోవైపు ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్‌‌‌‌‌‌‌‌.. రెండింటినీ బ్యాలెన్స్ చేయడం కష్టమైంది.

 పర్సనల్ లైఫ్‌‌‌‌‌‌‌‌లో ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. ఇన్‌‌‌‌‌‌‌‌స్టాగ్రామ్‌‌‌‌‌‌‌‌లో పరిచయమైన నిదా ఖాన్‌‌‌‌‌‌‌‌తో రీల్స్ చేస్తూ ప్రేమలో పడ్డాడు. వాళ్ల లవ్‌‌‌‌‌‌‌‌ స్టోరీ కూడా యూట్యూబ్‌‌‌‌‌‌‌‌లో వైరల్ అయింది. తర్వాత పెండ్లి చేసుకున్నారు. 2024 జనవరిలో వాళ్లకు కొడుకు జోహాన్ సుఫియాన్ పుట్టాడు. ఈ మధ్య సుఫియాన్ ట్రోలింగ్, ప్రైవసీ ఇష్యూస్, లీగల్ యాక్షన్స్ లాంటివి ఎదుర్కొన్నాడు. పోయినేడు నిదాతో విడిపోయాడు. ఇప్పుడు సుఫియాన్‌‌‌‌‌‌‌‌ మళ్లీ ‘సింగిల్ లైఫ్’ వ్లాగ్స్‌‌‌‌‌‌‌‌ మొదలుపెట్టాడు. అయితే.. ఎన్ని కష్టాలు ఎదురైనా క్రమం తప్పకుండా వ్లాగ్స్‌‌‌‌‌‌‌‌ అప్‌‌‌‌‌‌‌‌లోడ్ చేస్తూనే ఉన్నాడు. 

యూట్యూబ్‌‌‌‌‌‌‌‌ జర్నీ

సుఫియాన్‌‌‌‌‌‌‌‌ యూట్యూబ్‌‌‌‌‌‌‌‌లో ఇప్పటివరకు 1,094 వీడియోలు అప్‌‌‌‌‌‌‌‌లోడ్‌‌‌‌‌‌‌‌ చేశాడు. వాటిలో చాలా వీడియోలు వైరల్‌‌‌‌‌‌‌‌ అయ్యాయి. చానెల్‌‌‌‌‌‌‌‌కు  8.35 మిలియన్ల సబ్‌‌‌‌‌‌‌‌స్క్రయిబర్స్ ఉన్నారు. యూట్యూబ్‌‌‌‌‌‌‌‌తోపాటు అతనికి ఇతర సోషల్‌‌‌‌‌‌‌‌ మీడియా ఫ్లాట్‌‌‌‌‌‌‌‌ఫామ్స్‌‌‌‌‌‌‌‌లో కూడా ఫాలోయింగ్ బాగానే ఉంది. అతని ఇన్‌‌‌‌‌‌‌‌స్టాగ్రామ్‌‌‌‌‌‌‌‌ పేజీని 7.98 లక్షల మంది ఫాలో అవుతున్నారు. 

ఫేస్‌‌‌‌‌‌‌‌బుక్‌‌‌‌‌‌‌‌లో 6.23 లక్షలమంది, షేర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌చాట్‌‌‌‌‌‌‌‌లో 3.71 లక్షల మంది అతన్ని అభిమానిస్తున్నారు. అంతేకాదు.. కేవలం యూట్యూబ్‌‌‌‌‌‌‌‌ ద్వారానే ప్రతి నెలా లక్షల్లో డబ్బు సంపాదిస్తున్నాడు. బ్రాండ్ కొలాబరేషన్స్, స్పాన్సర్‌‌‌‌‌‌‌‌షిప్‌‌‌‌‌‌‌‌లు చేస్తున్నాడు.