Suhas: అంబాజీపేట ప్రీమియర్ షో..ఏ థియేటర్స్లో అంటే..

Suhas: అంబాజీపేట ప్రీమియర్ షో..ఏ థియేటర్స్లో అంటే..

సుహాస్ (Suhas) హీరోగా దుశ్యంత్ కటికినేని (Dushyanth Katikaneni) దర్శకత్వంలో జీఏ2 పిక్చర్స్, వెంకటేష్ మహా, ధీరజ్ మొగిలినేని కలిసి నిర్మిస్తున్న చిత్రం అంబాజీపేట మ్యారేజి బ్యాండు (Ambajipeta Marriage Band ). శివాని నాగరం హీరోయిన్గా నటిస్తుంది. శరణ్య ప్రదీప్ ముఖ్య పాత్ర పోషిస్తుంది. పెద్దింటి అమ్మాయితో ప్రేమ‌లో ప‌డ్డ హీరోకి ఊర్లో కులాలు, వర్గాల మధ్య పోరాటం ఎలా చేశాడనేది ట్రైలర్లో ఆసక్తిగా చూపించారు మేకర్స్. ఈ మూవీ రేపు (ఫిబ్రవరి 2న) థియేటర్లోకి రాబోతుంది.  

లేటెస్ట్ అప్డేట్ ప్రకారం..ప్రొడక్షన్ హౌస్ గీతా ఆర్ట్స్ 2 నుంచి ఇంట్రెస్టింగ్ అప్డేట్ వచ్చింది. ఈ మూవీ రిలీజ్ డేట్ కంటే ముందే థియేటర్లో చూడబోతున్నాం అంటూ పోస్టర్ రిలీజ్ చేసింది. అదేలాగా అంటారా..లేటెస్ట్ ట్రెండ్ పెయిడ్  ప్రీమియర్ షోస్(Paid Premier Shows). అంబాజీ పేట ఫిబ్రవరి 2 కన్నా ముందు ఫిబ్రవరి 1నే పెయిడ్ ప్రీమియర్స్ వేస్తున్నారు. ఈరోజు సాయంత్రం 8 గంటలకు ప్రీమియర్ షో పడనుంది.

అయితే సెలెక్టెడ్ ఏరియాస్లో ప్రీమియర్స్ వేస్తే..అక్కడ వచ్చే పాజిటివ్ టాక్ సినిమాకి ఎంతలా హెల్ప్ అవుతుందనేది మేకర్స్ అంచనా వేయబోతున్నట్లు తెలుస్తోంది. దీంతో ఈ మూవీకి ఆడియన్స్ నుంచి పాజిటివ్ టాక్ వస్తే..అది రేపటి నుంచి అంబాజీపేట బ్యూరోకి కలెక్షన్స్ పెంచడానికి హెల్ప్ అవుతుంది.ఈ క్రింద ఇవ్వబడిన లింక్ ఓపెన్ చేసి..టికెట్లను బుక్ చేసుకోవొచ్చు 

ఇక రీసెంట్గా ప్రీమియర్ షోస్ తో హిట్ కొట్టిన సినిమాలు..కలెక్షన్స్ పరంగా కూడా బాక్సాఫీస్ వసూళ్లు సాధించాయి. బేబీ, హాయ్ నాన్న, మంగళవారం, కీడాకోలా, మ్యాడ్, సామజవరగమన, సార్, పద్మభూషణ్, హనుమాన్ లాంటి సినిమాలకి ప్రీమియర్స్ షోస్ చాలా హెల్ప్ అయ్యాయి.

చిన్న హీరోగా వచ్చిన సుహాస్..ప్రతి సినిమాకి తన స్థాయిని అమాంతం పెంచుకుంటూ వెళ్తున్నాడు. ఇక అంబాజీపేట తో మారో హిట్ కొట్టడం కన్ఫమ్ అనే న్యూస్ వినిపిస్తుంది. మరికొన్ని గంటల్లో సినిమా ఎలా ఉండబోతుందో తెలుస్తోంది. ఈ మూవీకి శేఖర్ చంద్ర సంగీతం అందిస్తున్నారు.